దేశంలోనే ప్రముఖ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్ అనేక రకాల కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 5జీ నెట్ వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ స్మార్ట్ ఫోన్లలో ఓటీటీ యాప్స్ ద్వారా వినోదం పొందేందుకు ఇష్టపడుతున్నారు. దీన్నే దృష్టిలో ఉంచుకొని ఎయిర్ టెల్ పలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని తమ కస్టమర్లకు ఉచితంగా ప్రీమియం సర్వీసులో అందించేందుకు సిద్ధపడుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ప్రముఖ ఓటీటీ సంస్థలుగా పేరు సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్ వంటి యాప్స్. ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు అనేక ఆఫర్లను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఓటీటీ సర్వీసెస్ ఉచితంగా పొందాలంటే ఏ రీఛార్జ్ ప్లాన్ చేయించుకోవాలో తెలుసుకుందాం.
181 రీచార్జ్ ప్లాన్:
30 రోజులపాటు వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మొత్తం 15 జిబి ల డేటా లభిస్తుంది. అంతేకాదు 181 రీఛార్జ్ చేయించుకున్న తమ కస్టమర్లకు Airtel-Xstream యాప్ ద్వారా మొత్తం 22 ఓటీటీ యాప్స్ చూసేందుకు యాక్సెస్ లభిస్తుంది. ఇందులో SonyLiv సహా Lionsgate Play, Hoichoi, Chaupal, Sun NXT వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
451 రీచార్జ్ ప్లాన్ :
30 రోజుల వ్యాలిడిటీతో 50 జిబిల డేటా ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేయించుకుంటే లభిస్తుంది. అంతేకాదు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ సైతం ఉచితంగా నెల రోజుల పాటు చూడవచ్చు.
598 రీచార్జ్ ప్లాన్:
28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2gb డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ సౌకర్యాలు, ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా లభిస్తాయి. ఇక నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 వంటి యాప్స్ మొబైల్ వర్షెన్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు Perplexity PRO AI సర్వీసు సబ్ స్క్రిప్షన్ సైతం ఏడాది పాటు ఫ్రీగా అందుబాటులో ఉంది.
1199 రీచార్జ్ ప్లాన్:
84 రోజుల వాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా లభిస్తాయి. అలాగే దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ సైతం అందుబాటులో ఉంది. 30 రోజుల పాటు హెలో ట్యూన్స్ సబ్ స్క్రిఫ్షన్ లభిస్తుంది. Perplexity PRO AI సర్వీసు సబ్ స్క్రిప్షన్ సైతం ఏడాది పాటు ఫ్రీగా అందుబాటులో ఉంది.
1729 రీచార్జ్ ప్లాన్:
84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జిబి ల డేటా తో లభించే ఈ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 వంటి యాప్స్ ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది. అలాగే 30 రోజుల పాటు హెలో ట్యూన్స్ సబ్ స్క్రిఫ్షన్ లభిస్తుంది. Perplexity PRO AI సర్వీసు సబ్ స్క్రిప్షన్ సైతం ఏడాది పాటు ఫ్రీగా లభిస్తుంది.
Disclaimer: పైన ఉన్న సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఈ కంటెంట్, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే వివిధ వనరుల ఆధారంగా సిద్ధం చేయబడింది.