OTT Movie : ఓటీటీల పుణ్యమా అని ప్రతీవారం కొత్త కొత్త సినిమాలు పదుల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులను తమకు నచ్చిన జానర్లలో సినిమాలు చూస్తూ, కావాల్సినంత ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఉండే ఇంట్రెస్ట్ వేరు. ఆ ఇన్వెస్టిగేషన్, మధ్యలో వచ్చే ఊహించని ట్విస్టులు, దిమ్మతిరిగే క్లైమాక్స్… ఇది కదా కావాల్సింది అనుకునే వాళ్ళకోసమే ఈ మూవీ సజెషన్.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ’23’ (Iravai Moodu). 2025 మే 16న థియేటర్లలో విడుదలైంది. రాజ్ ఆర్ దర్శకత్వంలో, స్టూడియో 99, స్పిరిట్ మీడియా బ్యానర్‌లపై వెంకట్ సిద్దారెడ్డి నిర్మించారు. ఇందులో తేజ రాయపాటి (సాగర్), తన్మయి కుషి (సుశీల), జాన్సీ (సైకాలజిస్ట్), పవన్ రమేష్ (దాసు), తగ్గుబోతు రమేష్, ప్రణీత్, తదితరులు నటించారు. 2 గంటల 15 నిమిషాలు రన్ టైం ఉన్న ఈ సినిమాకు IMDbలో 7.2 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగులోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. అలాగే ఆహా (Aha) వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
రియల్ స్టోరీల ఇన్స్పిరేషన్ తో…
’23’ (ఇరవై మూడు) (2025) తెలుగు సోషల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ చిత్రం. 1991 ఛుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు పేలుడు వంటి నిజమైన ఘటనల స్ఫూర్తితో తెరకెక్కింది ఈ మూవీ. కుల వివక్ష, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు, సామాజిక అన్యాయం వంటి అంశాల నేపథ్యంలో రూపొందింది ఈ మూవీ.
కథలోకి వెళ్తే…
సాగర్ (తేజ రాయపాటి), ఒక దళిత యువకుడు. తన లవర్ సుశీల (తన్మయి కుషి)తో కలిసి ఒక చిన్న ఇడ్లీ సెంటర్ స్థాపించాలని కలలు కంటాడు. వీరిద్దరి రిలేషన్ లో కుల గోడలు అడ్డంగా నిలుస్తాయి. అయితే పెళ్లి కాకుండానే సుశీల గర్భవతి కావడంతో సాగర్‌పై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. 10,000 లోన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవినీతి అధికారుల కారణంగా రూపాయి కూడా పుట్టదు.
Read Also : బుర్ఖా వేసుకుని బుర్రపాడు పనులు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్
హీరో స్నేహితుడు దాసు (పవన్ రమేష్) పోలీసులకు తప్పుడు సాక్షిగా పని చేస్తూ ఉంటాడు. సాగర్‌ను త్వరగా డబ్బు సంపాదించే ఒక ప్రమాదకర మార్గంలోకి నడిపిస్తాడు. హీరో తీసుకున్న ఈ నిర్ణయం ఒక ఘోరమైన బస్సు దహన ఘటనకు దారితీస్తుంది. ఇందులో 23 మంది అమాయకులు మరణిస్తారు, సాగర్, దాసు జైలు పాలవుతారు. జైలులో, సాగర్ తన నేరం తీవ్రతను గ్రహించి, పశ్చాత్తాపంతో బాధపడతాడు. మరి ఇంతకీ హీరో జైలు నుంచి బయట పడ్డాడా? హీరోయిన్ పరిస్థితి ఏంటి? వీరిద్దరికీ ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.