Mowgli Glimpse : సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటిస్తున్న సినిమా మొగ్లీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. దాదాపు 50 సినిమాలు ఉన్న నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చెప్పుకోదగ్గ హిట్ చిత్రం ఒకటి కూడా లేదు. రాజరాజ చోర వంటి మంచి కాన్సెప్ట్ సినిమా ఈ బ్యానర్ లో ఉన్నా కూడా దానిని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
అయితే ఈ బ్యానర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి కానీ అవి బ్యానర్ కి ఊహించిన పేరును తీసుకురాలేకపోయాయి. ఈ బ్యానర్ లో వచ్చిన కార్తికేయ 2, ధమాకా వంటి సినిమాలు దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే ఈ బ్యానర్ ఒకవైపు పెద్ద సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా నిర్మిస్తుంది. కొద్దిసేపటి క్రితమే రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా గ్లిమ్స్ వీడియో విడుదలైంది.
గ్లిమ్స్ వీడియో టాక్
కొద్దిసేపటికి క్రితమే విడుదలైన ఈ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా యాంకర్ గా సుమా మంచి పేరు సాధించుకోవడం వలన పెద్ద పెద్ద నటుల సపోర్ట్ ఈ సినిమాకి బాగా లభిస్తుంది. అలానే సందీప్ రాజ్ కి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కొంతమేరకు ప్లస్ అయింది.
ఈ సినిమా గ్లిమ్స్ వీడియో నాని వాయిస్ తో మొదలైంది. సిటీలో బతకడం తెలియకపోయినా కూడా, అడవిలో బ్రతకడం మనకంటే 50 రెట్లు తెలుసు అని మొదలైంది ఈ గ్లిమ్స్ వీడియో.
ఒకడు తిండి నిద్రా లేకుండా 30 మందిని పరిగెత్తించాడు. గ్యాంగ్ స్టరో స్మగ్లరో కాదు, పాతికేళ్ళు కూడా నిండని ఒక ప్రేమికుడు. అని నాని వాయిస్ లో వింటుంటే మంచి హై వచ్చింది.
విలన్ గా పబ్లిక్ స్టార్
సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిన వ్యక్తులలో బండి సరోజ్ కుమార్ ఒకరు. వాస్తవానికి ఎప్పుడో తెలుగులో సినిమా చేయాల్సిన ఈయన ఫస్ట్ తమిళ్లో డెబ్యూ సినిమా చేసి, తెలుగులో సూర్యస్తమయం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బండి సరోజ్ కు మంచి గుర్తింపు వచ్చిన తర్వాత విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వడానికంటే ముందు యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు సరోజ్.
తన యూట్యూబ్ సినిమాలు, అలానే కరెంట్ ఇష్యూస్ పైన తాను స్పందించిన విధానం ఇవన్నీ కూడా తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి. అలా సరోజ్ పబ్లిక్ స్టార్ అయ్యాడు. అయితే స్వరోజ్ ఈ సినిమాలు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. గ్లిమ్స్ వీడియో చూస్తుంటే సరోజ్ కి మరియు రోషన్ కి మధ్య కీలక సన్నివేశాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. మొత్తానికి ఈ గ్లిమ్స్ కొంతమేరకు ఆకట్టుకుంటుంది. రోషన్ కనకాల కష్టం కూడా బాగా కనిపిస్తుంది.
Also Read : Mowgli : మోగ్లీ సినిమాలో హీరోయిన్ కి మాటలు రావా? ఒక హింట్ తో దొరికిపోయారు