Manam Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలలో అక్కినేని కుటుంబం (Akkineni Family) ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందించడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. ఇక ఈయన తుది శ్వాస వరకు కూడా కళామతల్లికి సేవ చేసి ఆఖరి శ్వాస వదిలారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు చివరిగా నటించిన మనం సినిమా (Manam Movie)అక్కినేని కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా అభిమానులకు మర్చిపోలేని సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి నటించడం విశేషం.
మనం సినిమా ఎంతో ప్రత్యేకం…
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగేశ్వరరావు(నాగేశ్వర Rao) తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి అయ్యారని పలు సందర్భాలలో నాగార్జున(Nagarjuna) తెలియజేశారు. అయితే ప్రస్తుతం నాగార్జున జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన కుటుంబ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మనం సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాల గురించి నాగార్జున తెలియజేశారు.
ఐసీయూ బెడ్ మీద నుంచే డబ్బింగ్ చెప్పిన ఏఎన్ఆర్..
తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించిన ఎప్పుడు ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదని, మనం సినిమా విషయంలో చాలా ఒత్తిడిగా ఫీలయ్యానని నాగార్జున తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నాన్న ఐసీయూ బెడ్ కే పరిమితం అయ్యారని తెలియజేశారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత డబ్బింగ్ చెప్పడం కోసం ఇతరులను ఏర్పాటు చేస్తామని చెప్పగా నాన్న మాత్రం అందుకు అసలు ఒప్పుకోలేదని నాగార్జున తెలియజేశారు. నా పాత్రకు నేనే డబ్బింగ్ (Dubbing)చెప్పుకుంటాను అంటూ ఐ సి యు బెడ్ మీద నుంచి నాన్న మనం సినిమా డబ్బింగ్ పూర్తి చేశారని నాగార్జున తెలియజేశారు.
నాగేశ్వరరావు డెడికేషన్ కు హ్యాట్సాఫ్…
ఇలా ఐసీయూ బెడ్ మీద ఉంటూ ఒక సినిమా డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. సినిమా పట్ల ఎంతో ఆసక్తి, ఫ్యాషన్ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయని ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల పట్ల నాగేశ్వరరావు గారికి ఉన్న డెడికేషన్ కు అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం నాగేశ్వరరావు క్యాన్సర్ బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. ఇక ఈయన భౌతికంగా లేకపోయినా తన సినిమాల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇక నాగార్జున విషయానికి వస్తే నాగార్జున సైతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన కూలి సినిమాలో సైమన్ అనే నెగటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.