War 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకవేళ సినిమా ఇలా తీస్తే సక్సెస్ అవుతుంది అనే క్లారిటీ దర్శకులకు ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి. సినిమా అనేది అయితే ఆకాశానికి తీసుకెళ్తుంది లేకపోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఒక దర్శకుడు ఆలోచన నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత చాలా ఒత్తిడితో బతకాల్సిన పరిస్థితి ఎప్పటినుంచో ఉంది.
అయితే కేవలం సినిమా నిర్మించడమే కాకుండా డిస్టిబ్యూషన్ లో కూడా చాలా దెబ్బలు తగులుతాయి. గతంలో దిల్ రాజు తాను అమృత అనే ఒక సినిమాను కొన్నానని, ఆ సినిమా తీవ్రమైన నష్టాలు తీసుకొచ్చింది అని చెప్పారు. ఆ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాల్ కింద పడింది అంటే అది ఖచ్చితంగా పైకి లేస్తుంది మీరు కూడా అంతే అని ధైర్యం ఇచ్చారట. అదే మాదిరిగా నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దిల్ రాజు ఒక స్థాయిని సంపాదించుకున్నారు.
భారీ లాస్ వచ్చిందా.?
ఇక అసలు విషయానికొస్తే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. ఈ సినిమాకి సంబంధించి తెలుగు డిస్ట్రిబ్యూషన్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ తీసుకున్నారు. ముందుగా నాగ వంశీ కూలీ సినిమా రైట్స్ కోసం ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. ఇక ఎన్టీఆర్ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో వార్ 2 డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. హైదరాబాదులో చాలా థియేటర్స్ ఈ సినిమా కోసం కేటాయించారు. కొంతమేరకు సినిమాకు మంచి టాక్ ఏ వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ సినిమా విషయంలో భారీ లాస్ వచ్చింది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
టేబుల్ ఏ మిగిలింది.?
గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగ వంశీ నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక మాట రాస్తారు. సినిమా చూసి రివ్యూ చదవాలి తప్ప రివ్యూ చదివి సినిమాకి వెళ్లకూడదు అని గుర్తు చేశారు. ఇప్పుడు నేనింతే సినిమా డైలాగ్ నాగ వంశీకి అన్వయిస్తున్నారు చాలామంది. మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఈరోజు ఆఫీసులో టేబుల్ ఏ మిగిలింది అని సియాజ్ సిండే ది ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు అదే సీన్ ని రీ క్రియేట్ చేసి నాగ వంశీకి వాడుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఎంత కోల్పోయారు, లేదంటే ఎంత లాభపడ్డారు అనేది నాగ వంశీ ఒకరోజు మీడియా ముందు చెబుతారు. అందులో సందేహం లేదు.
Also Read: Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?