Adam Hose: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న “ది హండ్రెడ్” టోర్నమెంట్ ఐదవ సీజన్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ టోర్నమెంట్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టు 16న ట్రెంట్ రాకెట్స్ – సదరన్ బ్రేవ్ మధ్య నాటింగ్ హమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ హోస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కుడికాలు చీలమండ వద్ద వక్రీకరించబడడంతో అతన్ని వెంటనే ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
Also Read: Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!
ఆగస్టు 16న జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌథెర్న్ బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో 140 పరుగులు చేసింది. బ్రేవ్ బ్యాటర్లలో ప్లూయ్ అత్యధికంగా 55 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో కెప్టెన్ విన్స్ నిరాశపరిచాడు. ఇతడు 7 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే జాసన్ రాయ్ 23 పరుగులు చేశాడు. జేమ్స్ కోలెస్ 25, బ్రేస్ వెల్ 28 పరుగులు చేశారు. దీంతో బ్రేవ్స్ వంద బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ట్రెంట్ రాకెట్స్ జట్టు 96 బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి విజయం సాధించింది.
రాకెట్స్ ఇన్నింగ్స్ లో టామ్ బాంటన్ 49, స్టోయినీస్ 7, జో రూట్ 6, డేవిడ్ విల్లే 1, రెహన్ అహ్మద్ 13, టామ్ మోర్స్ 55 పరుగులు చేశారు. అయితే ట్రెంట్ రాకెట్స్ జట్టును గాయాల బెడద వేధిస్తుంది. గత మ్యాచ్ లో కూడా ఒకరికి గాయం ఐన విషయం తెలిసిందే. జేమీ ఓవర్టన్ ఫాస్ట్ బౌలర్ గా పేరుగాంచిన విషయం తెలిసిందే. ఇతడు వేసిన ఓ బౌన్సర్ నేరుగా బ్యాటింగ్ చేస్తున్న టామ్ ఆల్సప్ హెల్మెట్ ని బలంగా తాకింది. ఈ దెబ్బకు ఆల్సప్ వెంటనే మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన ప్రత్యర్థి ఆటగాళ్లు, అంపైర్లు, వైద్య సిబ్బంది అతడి వద్దకు చేరుకుని పరీక్షించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కంకషన్ కి సంబంధించిన నిబంధనల ప్రకారం అతడు ఆటను కొనసాగించలేడని వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడిని మైదానం నుంచి బయటకి తీసుకువెళ్లారు.
Also Read: Jordan Cox: జోర్డాన్ కాక్స్ అరాచకం… ఒక్కో బంతికి 300… 10 సిక్సర్లు, 3 ఫోర్స్
ఐతే తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా మరో ప్లేయర్ గాయం బారిన పడ్డాడు. సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైఖేల్ బ్రేస్ వెల్ డీప్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. అయితే లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న టామ్ హోస్ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. బంతి బౌండరీ దాటినప్పటికీ అతడు ఆగేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. దీంతో అతడి కుడికాలు తీవ్రంగా గాయపడింది. అతడు నొప్పితో కేకలు వేయడంతో అంపైర్ ఆటను తాత్కాలికంగా నిలిపివేశాడు. ఇక వైద్య సిబ్బంది సమక్షంలో టామ్ ని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత గురించి ఇంకా అధికారికంగా నివేదిక వెలువడలేదు. కానీ అతడి ఆట ఈ సీజన్ లో కొనసాగడం అనుమానంగా ఉంది.
?utm_source=ig_web_copy_link