HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులోనే శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సతీసమేతంగా హాజరై సందడి చేశారు. ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత ఏ. ఏం రత్నం(A.M.Ratnam) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినప్పటికీ నాకు హరిహర వీరమల్లు సినిమా చాలా ప్రత్యేకమని తెలిపారు.
పవన్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం…
ఈ సినిమా ఒక హిస్టారికల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలైన చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారని నిర్మాత తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా కావటంతో ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్ మారిందని తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన సినీ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావటం విశేషమని రత్నం తెలిపారు.
వీరమల్లు ఆలోచింపజేసే సినిమా…
ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా? అని అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది అని తెలిపారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు అంటూ నిర్మాత రత్నం ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక ఈ సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు పాటు మాతో కలిసి నడిచిన టెక్నీషియన్లు అందరికీ కూడా ఈ సందర్భంగా రత్నం ధన్యవాదాలు తెలియజేశారు. ఇక కీరవాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులకు రత్నం ధన్యవాదాలు తెలియజేశారు.
టికెట్ల ధరలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం..
ఇక తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)కూడా ఈ సినిమాకు ప్రత్యేకంగా స్పెషల్ షో అనుమతి తెలపడమే కాకుండా సినిమా టికెట్ల ధరలను కూడా పెంచిన నేపథ్యంలో ఏఎం రత్నం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తప్పనిసరిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ నిర్మాత ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులలో మరిన్ని అంచనాలను పెంచేశాయి. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సోలో హీరోగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ (Nidhi Agerwal) నటించిన సంగతి తెలిసిందే.
Also Read: Udaipur Files: ఉదయపూర్ ఫైల్స్ వివాదం.. కేంద్రం కీలక మార్పులు.. విడుదలకు లైన్ క్లియర్ అయ్యేనా?