HHVM Pre Release Event : పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాని మొదట క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా అప్పట్లో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ని అలా చూసినప్పుడు చాలామందికి క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది. పవన్ కళ్యాణ్ అటువంటి యాక్షన్ సీక్వెన్స్ చేసి చాలా రోజులు కూడా అయింది.
కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. ఈ సినిమా కూడా పలు సందర్భాలలో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా జులై 24న విడుదలకు సిద్ధమవుతుంది. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయిన తర్వాత దీనిని టేకప్ చేశారు దర్శకుడు జ్యోతి కృష్ణ.
నా కళ్ళలో నీళ్లు తిరిగాయి
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా అయిపోయింది. ఒక మూడు రోజులు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. అప్పుడు నేను సార్ కి సినిమా చూపించాను. ఒక రెండు రోజులు సార్ తో నాకు కమ్యూనికేషన్ లేదు. నాకు లోపల టెన్షన్ గా ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఆలోచనలో ఉన్నాను. నేను లో ఫీలింగ్ లో ఉన్నాను. సడన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ గారు ఫోన్లో మాట్లాడుతూ నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఇంటి నుంచి బయటకు వస్తున్నాను నీ గురించి రెండు గంటలు మాట్లాడారు. కళాకారుడికి ఎన్ని డబ్బులు ఇచ్చిన సరిపోదు అప్రిసేషన్ చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఆయన నీ గురించి రెండు గంటలు మాట్లాడారు. అని త్రివిక్రమ్ గారు చెప్పగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మేమందరం ఈ సినిమా చూసి గర్వపడతాం
పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ..
సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఈ సినిమా చూసి మేము అలానే మీ అభిమానుల అంతా కూడా గర్వపడతాం అంటూ చెప్పుకోచ్చారు. అలానే నిర్మాత ఏం రత్నం గురించి మాట్లాడుతూ మా ఫాదర్ నాకు మంచి పేరు సంపాదించి పెట్టారు. ఈ పేరు వల్లే పవన్ కళ్యాణ్ గారితో పని చేసే అవకాశం నాకు దక్కింది అంటూ తెలిపారు. అలానే సినిమా కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ ఏంటి.? బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్