Udaipur Files: ఇటీవల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ సినిమాలో విడుదలకు అడ్డుపడుతూ ఉంటారు. సినిమాలలో కొన్ని సంఘటనలు కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ సినిమా విడుదలకు అభ్యంతరాలు చెబుతూ ఉంటారు. ఇలా తీవ్రమైన అభ్యంతరం ఎదుర్కొంటున్నటువంటి వాటిలో “ఉదయపూర్ ఫైల్స్” (Udaipur Files)సినిమా ఒకటి. ఉదయపూర్ లో జరిగిన దర్జీ కన్హయ్య లాల్(Kanhaiya Lal) హత్య అనంతరం చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఉదయపూర్ ఫైల్స్. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వివాదాలలో చిక్కుకుంది.
6 మార్పులు చేసిన కేంద్రం…
ఈ సినిమా విడుదలను అడ్డుకోవడంతో దర్శక నిర్మాతలు ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేయాలి అంటూ సుప్రీంకోర్టును (Suprem Court)ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సినిమా విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోరింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీలో భాగంగా సినిమాలో 6 మార్పులను చేయటంతో కేంద్ర సమాచార ప్రసార శాఖ అంగీకరించడంతో దాదాపు ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టేనని తెలుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరు మార్పులు ఏంటి అనే విషయానికి వస్తే..
*ఇప్పటికే ఉన్న డిస్ క్లయిమర్ ను సిఫార్సు చేసిన డిస్ క్లయిమర్ తో భర్తీ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలని సూచించింది.
*ఈ సినిమా క్రెడిట్ లో కొంతమంది వ్యక్తుల పేర్లను తొలగించాలని కూడా సూచనలు చేశారు.
*తల పాగాకు సంబంధించి ఏఐతో క్రియేట్ చేసిన ఒక సన్నివేశంలో కూడా కొన్ని మార్పులు చేయాలని ఈ సందర్భంగా కేంద్రం తెలియచేసింది.
*నూతన్ శర్మ ఈ సినిమాలో ఒక మతాన్ని ఉద్దేశించి డైలాగ్ చెప్పారు అయితే ఈ డైలాగును అభ్యంతరం తెలుపుతూ తొలగించారు.
*ఇకపోతే బాలుచి గురించి ప్రస్తావన చేసిన రెండు సన్నివేశాలను కూడా తొలగించబడింది..
*ఈ సినిమా పోస్టర్ నుంచి మొదలుకొని నూతన్ శర్మ పేరు ఎక్కడైతే వస్తుందో అన్నిచోట్ల ఆ పేరును తొలగించి కొత్త పేరుతో రీ ప్లేస్ చేయాలని కోరారు.
కుల మతాలకు సంబంధించింది కాదు…
ఇలా ఈ ఆరు మార్పులను చేస్తూ కేంద్రం ప్రత్యేకంగా నియమించిన కమిటీ కేంద్ర ప్రసార సమాచార శాఖకు నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రసార సమాచార శాఖ అంగీకారం తెలిపింది. దీంతో ఈ సినిమా విడుదలకు దాదాపు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది. జూన్ 28, 2022 సంవత్సరంలో టైలర్ కన్హయ్య దుకాణంలోకి ఇద్దరు దుండగులు కస్టమర్లు మాదిరిగా వెళ్లి కన్హయ్య కొలతలు తీస్తుండగా ఒకరు అతనిపై దాడి చేయగా మరొకరు అతని తల నరికి చంపారు. ఇక ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించే అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. అయితే ఈ ఘటన ఆధారంగానే ఉదయపూర్ ఫైల్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ఏ మతానికో కులానికో సంబంధించింది కాదని భావజాలం, సత్యం గురించి మాత్రమే తెలియజేస్తుంది అంటూ మేకర్స్ చెబుతున్న ఈ సినిమాని మాత్రం వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.
Also Read: Pawan Kalyan: పవన్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా ? తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!