Rambha Urvasi Menaka OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో కామెడీ సినిమాలు చేస్తే హీరోగా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో నటుడు నరేష్(Allari Naresh) ఒకరు. నరేష్ ఒకానొక సమయంలో తన సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇటీవల కాలంలో నరేష్ నటిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి నేపథ్యంలోనే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా యాక్షన్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో రంభ, ఊర్వసి , మేనక అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా సూపర్ కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో ప్రసారమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon)స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 4 న థియేటర్లలో విడుదల కావడంతో సెప్టెంబర్ చివరివారం లేదా అక్టోబర్ 1లేదా 2 తేదీలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. అల్లరి నరేష్ సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మాణం వహించారు.ఇక ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనక పాత్రలలో విష్ణు ప్రియ, ప్రిష సింగ్, రాశీ సింగ్ నటించారు.
రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేష్) ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. తన వంశపారంపర్యంగా వచ్చిన ఒక మ్యాజిక్ బుక్ పైన ముగ్గు వేస్తే ఇంద్రలోకం నుంచి దేవకన్యలు వస్తారని తన బాబాయ్ (వీకే.నరేష్ ) తనని నమ్మిస్తాడు. అదే సమయంలో తన తల్లి అనారోగ్యంపాలవడంతో సూరి మ్యాజిక్ బుక్ పైన ముగ్గు వేసి దేవకన్యలను భూలోకంలోకి రప్పిస్తారు. దేవకన్యలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూరి ప్రేమ ఫలించిందా? దేవకన్యలు వచ్చిన తర్వాత సూరి కోరికలు నెరవేరుతాయా? ఈ గందరగోల పరిస్థితుల నుంచి సూరి ఏ విధంగా బయటపడ్డారు అనేది సినిమా కథ. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో ప్రసారమవుతున్న ఈ సినిమాకు తదుపరి ఎలాంటి ఆదరణ లభిస్తుంది కలెక్షన్ల పరంగా ఏ స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబడుతుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?