Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెటర్ తో పాటు.. ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకు స్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ఆర్ధిక పరపతి.. 2047 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుతుందని లోకేష్ తెలిపారు. ఆయన విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా మలచే లక్ష్యంతో.. ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు.
విశాఖ ప్రజలు నాకు ఇష్టం. ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం మేము చేస్తాం. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఎదగబోతోంది అని లోకేష్ వెల్లడించారు.
రాష్ట్రానికి వచ్చే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులలో.. 50 శాతం పెట్టుబడులు విశాఖకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని లోకేష్ తెలిపారు. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, స్టార్టప్ రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.
విశాఖలో వచ్చే ఐదు సంవత్సరాలలో.. 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని లోకేష్ ప్రకటించారు.
కాంటిజెంట్, సత్వ, గూగుల్, టిసిఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్‌లో స్థిరపడుతున్నాయి. రాబోయే మూడు నెలల్లో మరెన్నో సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి అని తెలిపారు.
టీసీఎస్ నవంబర్‌లో విశాఖలో కొత్త సెంటర్‌ను ప్రారంభించబోతోందని, ఆ కార్యక్రమానికి కాంటిజెంట్ సీఈవో స్వయంగా హాజరుకానున్నారని లోకేష్ చెప్పారు. అదే విధంగా, గూగుల్ టీం మంగళవారం విశాఖకు రానుందని, వారు పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారని చెప్పారు.
కాగా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతోందన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక పటంలో మైలురాయిగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు.
టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు.. 99 పైసలకే ఇచ్చామని ఆరోపిస్తున్నారు. కానీ అది తప్పేమీ కాదు. ఆ సంస్థలు రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్నాయి. భవిష్యత్తు దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ నాలుగు జిల్లాలను కలిపి.. గ్రేటర్ ఎకనమిక్ జోన్ రూపొందించారు. ఈ ప్రాంతంలో అనేక మల్టినేషనల్ కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు.
Also Read: బొత్స అంత మాటలు.. జగన్ ప్లాన్ లో భాగమేనా?
హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. కానీ విశాఖకు పది సంవత్సరాలు చాలు అని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. సమగ్ర ప్రణాళిక, పారదర్శక పాలన ఉంటే విశాఖను ప్రపంచ నగరంగా మలచగలం అని నారా లోకేష్ అన్నారు.
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని: నారా లోకేశ్
హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు
అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ప్రజల ముందుకొస్తే గెలిపించి ఆశీర్వదించారు
– మంత్రి నారా లోకేశ్ pic.twitter.com/O1UjMuzKpu
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2025