BigTV English

Garividi Lakshmi Glimpse: ఉత్తరాంధ్ర సొగసు ఉట్టిపడుతోంది, మరో మట్టి సినిమా

Garividi Lakshmi Glimpse: ఉత్తరాంధ్ర సొగసు ఉట్టిపడుతోంది, మరో మట్టి సినిమా

Garividi Lakshmi Teaser: ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…. ఒకప్పుడు కథలు రాయడం చాలా ఈజీగా ఉండేది. పది ఇంగ్లీష్ సినిమాలు చూసి ఒక కథ రాసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు ఏ కథ రాసిన ఎక్కడి నుంచి కాపీ కొట్టాము అని ఈజీగా చెప్పేస్తున్నారు. అందుకనే మనకు ఇప్పుడు ఛాయిస్ లేదు. మన కథనే మనము చెప్పాలి అంటారు.


ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు. మన మధ్య ఉన్న గొప్ప వాళ్ళ కథలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మన సొంత ఎమోషన్స్, బాంధవ్యాలు, అనుబంధాలు ను చూపించడం మొదలుపెట్టారు. అందుకే బలగం లాంటి సినిమాలుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలానే మనకు తెలియని మన మధ్య ఉన్న గొప్ప వ్యక్తులు కథలు కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా పాపులర్ అయిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఉత్తరాంధ్ర సొగసు ఉట్టిపడుతోంది


గరివిడి లక్ష్మి బయోపిక్ అన్నప్పుడు అంతగా ఏముంటుంది అని చాలామంది అనుకున్నారు. టీవీలు లేని రోజుల్లో బుర్రకథ చాలామందికి ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆమె కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియో చూడగానే చాలా ఆసక్తికరంగా ఉంది. ఉత్తరాంధ్ర యాసలో ఆమె గురించి చెప్పడం గ్లిమ్స్ వీడియోలో హైలెట్. గరివిడి లక్ష్మి కథను చెప్పడానికి ఏముంటుంది అనేదానికి, ఈ వీడియో ఒక ఆన్సర్ లా అనిపిస్తుంది. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము చాలా తెలివిగా ఆమె ఎచీవ్ చేసిన మూమెంట్స్ ను గ్లిమ్స్ వీడియోలోనే ప్రజెంట్ చేశాడు. కేవలం హాస్యానికి మాత్రమే పరిమితం చేసిన ఉత్తరాంధ్ర యాషకు ఒక గౌరవం తీసుకొచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది అని అర్థమవుతుంది. రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆనంద్ కి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఆనంది పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు.

సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత 

బుర్రకథ అంటేనే పాటలతో కూడుకుని ఉంటుంది. ఇటువంటి సినిమాకి పాటలు చేయడం ఒకరకంగా సాహసం అని చెప్పాలి. ఒరిజినల్ పాటలో ఉన్న ఫీల్ పోకుండా, దానిని ఇప్పుడు జనరేషన్ కి అందించడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా నుంచి “నల జీలకర్ర మొగ్గ” అనే పాట ఇదివరకే రిలీజ్ అయింది. ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ పాట “గరివిడి లక్ష్మి” అనే సినిమాలోనిది అని ఎవరు గుర్తించలేదు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ చాలా తెలివిగా ఆ పాటకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేసి గ్లిమ్స్ వీడియోకు అటాచ్ చేశాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా చరణ్ అర్జున్ కి కూడా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాకి ఆదిత్య సినిమాటోగ్రఫీ చేశారు. విజువల్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. మొత్తానికి ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఒక మట్టి సినిమా రాబోతుంది అని అర్థమవుతుంది.

Also Read : Naga Vamsi: నేను ఆ డైరెక్టర్ తో గొడవపడ్డాను, కానీ అది ఎంతకీ తెగలేదు

Related News

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Madharaasi : మదరాసి సినిమా కథ చెప్పేసిన మురగదాస్, ఏకంగా గజినీ రేంజ్

Coolie: కూలీ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడం వెనక కారణం ఇదే

Mass Jathara: ఆగస్టు నుంచి తప్పుకున్న మాస్ జాతర… విడుదల అప్పుడేనా?

Big Stories

×