Cricketers Names : సాధారణంగా క్రికెటర్లలో పేర్లు చాలా రకరకాలుగా ఉంటాయి. కొందరికి వారి పూర్తి పేర్లతో పిలవబడితే.. మరికొందరూ ముద్ధు పేర్లతో పిలువబడుతారు. ఇంకొందరూ వారి ఆట తీరును బట్టి ఇలా రకరకాలుగా పేర్లు పెడుతుంటారు. మరికొందరి క్రికెటర్లలో అయితే పేర్లు చిత్ర, విచిత్రంగా ఉండటం సాధారణం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరు ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని పేర్లు వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి వెనుక పలు ఆసక్తికరమైన కథలు లేదా అర్థాలు ఉంటాయి. కొందరూ క్రికెటర్లకు వారి వ్యక్తిత్వం ఆధారంగా.. మరికొందరికీ వారి ఆటతీరు లేదా కుటుంబ సభ్యులు పెట్టే పేర్లు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతీ పేరు వెనుక ఓ కథ ఉండే ఉంటుంది. కొంత మంది క్రికెటర్ల పేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : KL Rahul: ఒకప్పుడు బ్యాట్ కూడా అమ్ముడుపోలేదు.. కానీ ఇప్పుడు లార్డ్స్ మ్యూజియంలోనే Kl రాహుల్ వస్తువులు
రూట్ :
ఇంగ్లాండ్ క్రికెటర్ పేరు రూట్. ఇతనికి రూట్ అనే పేరు ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చింది అనే విషయం తెలియదు. కానీ ఈ పేరు మాత్రం చాలా విచిత్రమైనదే అని చెప్పవచ్చు. రూట్ అంటే మొక్క భూగర్భ భాగం. ఇది నీరు, పోషకాలను గ్రహిస్తుంది. ఆహారాన్ని నిలువ చేస్తుంది. ఇక ఇలాంటి పేరును రూట్ కి ఎందుకు పెట్టారో తెలియదు.
కుక్ :
అలస్టర్ నాథన్ కుక్ అనేది అస్సలు పేరు. కానీ అందరూ ముద్దుగా కుక్ అని పిలుచుకుంటారు. ఇతను కూడా ఇంగ్లాండ్ క్రికెటరే. టెస్ట్ క్రికెట్ లో అత్యంత గొప్ప ఓపెనింగ్ బ్యాటర్ గా పరిగణిస్తారు.
బౌల్ట్ :
ట్రెంట్ బౌల్డ్ న్యూజిలాండ్ కి చెందిన కీలక బౌలర్. అయితే ఇతనికి బౌల్ట్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ ఈయన పేరు కూడా విచిత్రంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బౌల్ట్ లు, నట్ల పక్కన బౌల్ట్ ఫొటో పెట్టడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
కింగ్ :
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ని కింగ్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇతనికి కింగ్ అనే బిరుదు ద్వారా కింగ్ తో పోల్చినట్టుగా సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతోంది.
Also Read : Gambia vs Zim : 4 ఓవర్లలో 93 పరుగులు… 20 ఓవర్లకే 344 స్కోర్… ఇదెక్కడి అరాచకం రా
వాషింగ్టన్ :
వాస్తవానికి వాషింగ్టన్ అనేది ఒక నగరం. అయితే టీమిండియా క్రికెటర్ పేరు కూడ వాషింగ్టన్ సుందర్ అని ఉండటంతో అతన్ని వాషింగ్టన్ తో పోల్చుతున్నారు. అతని పేరు కూడా వెరైటీగా ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
సాల్ట్ :
ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ క్రికెటర్. ఇతను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టులో ఓపెనర్ బ్యాటర్. 2025 ఐపీఎల్ టైటిల్ సాధించడంలో సాల్ట్ బ్యాటింగ్ కీలకం అనే చెప్పవచ్చు. సాల్ట్ అంటే ఉప్పు.. ఇతనికీ సాల్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందని చర్చించుకోవడం విశేషం.
లుంగీ :
సౌతాఫ్రికా ఆటగాడు లుంగీ ఎంగిడీ గురించి అందరికీ తెలిసిందే. ఇతను సౌతాఫ్రికా కి చెందిన కీలక బౌలర్. కానీ ఇతని పేరు కూడా వెరైటీగా ఉంది.
పంత్ :
రిషబ్ పంత్ ని ఇంగ్లీషులో షాట్ కర్ట్ లో ప్యాంట్ అని పిలుస్తున్నారు. ఇలా రిషబ్ పంత్ పేరు ప్యాంట్ గా పోల్చారు.
వుడ్ :
ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ గురించి తెలిసిందే. అతన్ని వుడ్ తో పోల్చారు. సోషల్ మీడియాలో అతని పేరు కూడా చిత్రంగా ఉందని చర్చించుకుంటున్నారు.
గంటా :
గంటాకా కింగ్ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ని పిలుస్తుంటారు. ఈ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెరైటీ విచిత్ర పేర్లు వైరల్ కావడం విశేషం.