Naga Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా స్థాపించబడింది. హారిక హాసిని క్రియేషన్స్ లో ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తారు.
మరోవైపు త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య కూడా ఒక బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు త్రివిక్రమ్ బ్యానర్ కలిసి కొన్ని సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. వాళ్లు నిర్మించిన సినిమాలలో మ్యాడ్ సినిమా ఒకటి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. నటీనటులు పెద్దగా తెలియకపోయినా కూడా, నాగ వంశీ ప్రమోషన్స్ వలన ఈ సినిమాకి ఆడియన్స్ విపరీతంగా వచ్చారు. సినిమా బాగుండటం వలన హిట్ అయిపోయింది.
నేను ఆ డైరెక్టర్ తో గొడవపడ్డాను
మ్యాడ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కళ్యాణ్ శంకర్ దర్శకుడుగా పరిచయమయ్యాడు. కళ్యాణ్ శంకర్ నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ ప్రోమో విపరీతమైన రెస్పాన్స్ సాధించింది. కొన్ని కారణాల వలన ఆ సినిమా కళ్యాణ్ శంకర్ వదిలేసాడు. ఆ తర్వాత మ్యాడ్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిట్ అయిన వెంటనే మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమాను తీశారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. అయితే మ్యాడ్ స్క్వేర్ సినిమా విషయంలో హీరోయిన్స్ ఉండాలి అని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తో విపరీతమైన గొడవపడ్డాడట నాగ వంశీ. అయినా ఎంత ట్రై చేసినా కూడా హీరోయిన్స్ ను ఇన్వాల్వ్ చేయడానికి అవ్వలేదు.
ఫోకస్ అంతా గోవా పైన
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో హీరోయిన్స్ అసలు ఉండరు. ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్ళిపోతారు. అయితే ఈ విషయంలో నాగ వంశీ బాబాయ్ సూర్యదేవర రాధాకృష్ణ ఖచ్చితంగా హీరోయిన్స్ ఉండాలి అని మొత్తుకొని మరీ చెప్పారట. అయితే అది దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ శంకర్ ఎలా అయినా కథలో ఇన్వాల్వ్ చేద్దాం అని బాగా ట్రై చేసాడట. కానీ అది కుదరలేదు. సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ విషయంలో మాత్రం కొద్దిపాటి అసంతృప్తి ఉంది అని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు నాగ వంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read : Ram Pothineni : మాస్ ట్విస్ట్, రామ్ పాటను రాయడానికి అసలైన కారణం ఇదే