E-Paper
Advertisement

AnasuyaBharadwaj : శివాజీ వివాదం మరో సెన్సేషనల్ అనసూయ…నేను ఇలాగే ఉంటానంటూ!

AnasuyaBharadwaj : శివాజీ వివాదం మరో సెన్సేషనల్ అనసూయ…నేను ఇలాగే ఉంటానంటూ!
Advertisement

Anasuya Bharadwaj: నటుడు శివాజీ వర్సెస్ అనసూయ అంటూ గత రెండు రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. దండోరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శివాజీ(Shivaji) హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ బహిరంగ వేదికగా ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి ఆయన ఉపయోగించిన పదాలు వివాదానికి దారి తీసాయి. దీంతో శివాజీపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇక ఈ వివాదం గురించి పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. నటి అనసూయ సైతం ఈ వివాదం పై తరచూ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

నా వ్యవహార శైలి మారదు..

తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా మరొక ట్వీట్ చేశారు. ఈ సమాజంలో మహిళల విషయంలో ఇలా జరుగుతుంటే ఏమాత్రం వివక్షత లేకుండా, నాకు సంబంధం లేకపోయినా, తాను స్పందిస్తానని తెలిపారు. ఇలాంటి సంఘటనల విషయంలో తాను ప్రభావితం కాకుండా బాధపడకుండా అండగా నిలుస్తానని, తన వ్యవహార శైలి ఏమాత్రం మార్చుకోనని తెలిపారు. నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటూ అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు అనంతరం అనసూయ తరచు ఈ ఘటన పట్ల స్పందిస్తూనే ఉన్నారు.

ఆమె రుణం తీర్చుకుంటాను..

Advertisement

ఇక అనసూయ స్పందన పై శివాజీ కూడా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కాలేదని, కచ్చితంగా ఆమె రుణం తీర్చుకుంటాను అంటూ శివాజీ స్పందించారు. ఈ స్పందన పై కూడా అనసూయ ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలా పరోక్షంగా శివాజీకి వరుస కౌంటర్లు ఇస్తూ అనసూయ చేస్తున్న పోస్టులు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక అనసూయ మహిళల విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే స్పందిస్తూ తన అభిప్రాయాలను బయటపెడుతూ ఉంటారు. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో అనసూయ ఇదివరకు ఎన్నో సందర్భాలలో స్పందించారు. తన బట్టలు తన ఇష్టమని తనకు నచ్చినట్టు వేసుకుంటానని గతంలో కూడా తెలిపారు. మనుషులకు బట్టల కంటే కూడా క్యారెక్టర్ ముఖ్యమంటూ అనసూయ తన వాదనను వినిపిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా తాను ఇలాగే ఉంటానని, తనలో ఏమాత్రం మార్పు ఉండదు అంటూ ఈమె చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇక శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది శివాజీకి మద్దతుగా నిలవగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×