E-Paper
Advertisement

School Bus Accident: శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. పాఠశాల బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది

School Bus Accident:  శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం..  పాఠశాల బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది
Advertisement

School Bus Accident: శంషాబాద్ సమీపంలో ఓ పాఠశాల బస్సు బోల్తా పడింది. ముందు వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనేవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో అందులో 60 మంది విద్యార్థులు ఉన్నారు.

Advertisement

శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం

Advertisement

పాఠశాల బస్సు ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రిషి స్కూల్‌ బస్సు.. శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు పిక్నిక్‌ కోసం విద్యార్థులను తీసుకెళ్తుంది. వేగంగా వెళ్లే క్రమంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయింది. ఈ క్రమంలో డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ఘటన సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో చాలమంది విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే అంబులెన్స్‌కి స్థానికులు సమాచారం ఇచ్చారు. గాయపడినవారిని అంబులెన్సుల ద్వారా స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఘటన గురించి తెలుసుకోగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో శంషాబాద్‌ కు వెళ్లే దారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

పాఠశాల బస్సు బోల్తా.. బస్సులో 60 మంది విద్యార్థులు

అదే సమయంలో వనపర్తి పర్యటనకు వెళ్తున్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. తన కాన్వాయ్‌ని ఆపి బస్సు దగ్గరికి వెళ్లారు. ప్రమాద స్థలంలో కారుని మంత్రి స్వయంగా పక్కకు తోశారు. బోల్తా పడ్డ బస్సుని క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే రహదారి‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మంత్రి స్వయంగా ట్రాఫిక్‌ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. గాయపడిన విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు. విద్యార్థులకు ధైర్యంచెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని షాద్‌నగర్ వైద్యులకు ఫోన్ చేసి చెప్పారు. విద్యార్థులకు దగ్గరుండి అన్ని చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ALSO READ:  తండ్రికొడుకులను ఈడ్చుకెళ్లిన స్కూల్ బస్సు

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×