Pradeep Ranganathan : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. తాను దర్శకత్వం వహించిన కోమాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తనే హీరోగా లవ్ టుడే అనే సినిమాను తెరకెక్కించాడు. కేవలం ఆ సినిమాకి దర్శకత్వం చేయడం మాత్రమే కాకుండా హీరోగా కూడా ఆ సినిమాలో నటించాడు. ఆ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించడంతో తెలుగులో కూడా అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.
ఆ సినిమా తెలుగులో విడుదల కాగానే ప్రదీప్ రంగనాథనికి మంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. తెలుగు ఆడియన్స్ విపరీతంగా ప్రదీప్ రంగనాథన్ ను ప్రేమించడం మొదలుపెట్టారు. తను నటించిన డ్రాగన్ సినిమా కూడా ఇక్కడ మంచి సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమా మంచి సక్సెస్ అయింది. మొత్తానికి ఈ యంగ్ హీరో మొదటి మూడు సినిమాల తోనే వరుసగా 100 కోట్లకు సినిమాలు కొట్టాడు. ఇప్పుడు నాలుగువ సినిమా ఏంటి అని ఆసక్తి అందరికీ నెలకొంది.
ప్రదీప్ నటుడు కంటే కూడా ముందు దర్శకుడు. దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు కాబట్టే వరుసగా సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయ్యింది. అయితే తనలో దర్శకుడు ఉన్నాడు కాబట్టి తాను నటించే సినిమాలు విషయంలో కూడా మంచి కేర్ తీసుకుంటాడు.
ఇక ప్రదీప్ తాను నటించబోయే నాలుగువ సినిమాకి మరో దర్శకుడుని తీసుకోవడం లేదు. స్వయంగా తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకోనన్నాడు ప్రదీప్. దీని గురించి అధికారి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే ఈసారి ఎటువంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా భాషతో సంబంధం లేకుండా కొంతమంది హీరోలను ఇష్టపడుతూ ఉంటారు. అలా చాలామంది తమిళ్ హీరోలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సూర్య, విక్రమ్, సిద్ధార్థ్ వంటి ఎంతోమంది హీరోలు ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇక రీసెంట్ టైమ్స్ లో ధనుష్, విజయ్ , శివ కార్తికేయన్ వంటి హీరోలు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులోకి తాజాగా ప్రదీప్ రంగనాథన్ చేరిపోయాడు. ఒక జర్నలిస్ట్ ప్రదీప్ ను మీరు హీరో మెటీరియల్ కాదు అని అన్నందుకు తెలుగు ప్రేక్షకుల నుండే విపరీతమైన నెగిటివిటీ ఆ జర్నలిస్ట్ పైన వచ్చింది. అంటే తెలుగు ప్రేక్షకులు ప్రదీప్ ను ఎంతలా ఓన్ చేసుకున్నారు ఆ రియాక్షన్ చుస్తే అర్థమైపోతుంది.
Also Read: Thaman : ఒత్తిడిలో ఉన్న తమన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై కసరత్తు