BigTV English
Advertisement

Baahubali The Epic : బాహుబలి శివలింగం ప్లేస్లో జండూబామ్, ప్రొడ్యూసర్ బలి అన్నారు

Baahubali The Epic : బాహుబలి శివలింగం ప్లేస్లో జండూబామ్, ప్రొడ్యూసర్ బలి అన్నారు

Baahubali The Epic : తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మాట్లాడుకోబోయే సినిమా బాహుబలి. తెలుగు సినిమాకి సరైన గుర్తింపు లేదు అనుకునే తరుణంలో బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తెలుగులో ఇంత గొప్ప డైరెక్టర్లు ఉన్నారు అని ప్రూవ్ చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలకు ఒక రోడ్డు వేసింది.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్లో సినిమాలు నిర్మితమవుతున్నాయి అని తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు విపరీతంగా వాటికోసం ఎదురుచూస్తున్నారు అంటే అది బాహుబలి సినిమా ఇచ్చిన చొరవ అని చెప్పాలి. అయితే బాహుబలి సినిమాకి మొదట అనుకున్నా స్థాయి రిజల్ట్ రాలేదు. తర్వాత ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రను మార్చే సినిమా అయిపోయింది.

శివలింగం ప్లేస్ లో జండూబామ్ 

బాహుబలి సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలో కనిపించారు ఒకటి అమరేంద్ర బాహుబలి. 2 శివుడు. శివుడు అనే పాత్రలో ప్రభాస్ ఫస్ట్ పార్ట్ లో కనిపిస్తారు. శివుడు అనే పాత్ర చేసిన సాహసాలు సినిమాలో ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఒక సందర్భంలో శివలింగాన్ని తన భుజం మీద వేసుకొని ప్రభాస్ నడుస్తూ ఉంటాడు.


సినిమాలో ఆ సీన్ పెద్ద హైలెట్. దాదాపు పది సంవత్సరాల క్రితం ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. దాంట్లో చాలామంది సినిమా ప్రముఖులు కూడా ఉండేవాళ్ళు. అయితే ఎలానో వల్లి గారి నెంబర్ ఆ గ్రూపులోకి వెళ్లిపోయింది. బాహుబలి సినిమా రోజు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ఆ గ్రూపులో వచ్చాయి.

శివలింగాన్ని మోసుకు వెళ్తున్న తరుణంలో అక్కడ జండూబామును పెట్టి ఎడిటింగ్లు కూడా చేశారు. మరోవైపు ఇది బాహుబలి కాదు ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్లు బలి, ఎగ్జిబిటర్లు బలి అంటూ విపరీతంగా కామెంట్స్ వచ్చాయి.

ఎవరికి చెప్పలేదు 

అయితే వల్లి గారు మాత్రం ఆ మెసేజ్ లు చూస్తూ ఉన్నారు తప్ప ఎవరికీ దాని గురించి పెద్దగా చెప్పలేదు. అయితే సాయి కొర్రపాటి ఒక డిస్ట్రిబ్యూటర్ కాబట్టి, తనకు సాయంత్రానికి జెన్యూన్ రిజల్ట్ తెలిసింది. రెండు రోజులు తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థమయిపోయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే రాజమౌళి చాలా టెన్షన్ పడుతూ రెండవ పార్ట్ ని ఎంత త్వరగా తీయగలం అనే ప్లాన్ లో కూడా వేశారు. మొత్తానికి సినిమా సేఫ్ జోన్ అని తెలిసిన తర్వాత వాళ్లు కూల్ అయ్యారు. దాదాపు 120 కోట్లు బడ్జెట్ చేసిన ఆ ప్రాజెక్ట్ తీవ్రంగా టెన్షన్ పెట్టింది. రాజమౌళి కూడా తన ఫెయిల్యూర్ గురించి కాకుండా శోభు గురించి ఎక్కువ టెన్షన్ పడ్డాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: Thaman : ఒత్తిడిలో ఉన్న తమన్ రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై కసరత్తు

Related News

Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి 

Suriya: మరో తెలుగు డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్

MassJathara vs Bahubali The Epic: మాస్ జాతర vs బాహుబలి ది ఎపిక్.. బాక్సాఫీస్ విజేత ఎవరు?

Pradeep Ranganathan : ఈసారి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం లేదు

Big Stories

×