BigTV English

Pawan Kalyan: ఇట్స్ అఫీషియల్.. నిర్మాతగా పవన్ కళ్యాణ్.. త్వరలోనే కొత్త సినిమా?

Pawan Kalyan: ఇట్స్ అఫీషియల్.. నిర్మాతగా పవన్ కళ్యాణ్.. త్వరలోనే కొత్త సినిమా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన నటనతో ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా రాజకీయాలలో(Politics)కి అడుగుపెట్టారు. జనసేన పార్టీ(Janasena Party)ని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఒకవైపు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.


డిప్యూటీ సీఎం హోదాలో పవన్..

ఇకపోతే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో గెలిచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా(AP Deputy Cm) బాధ్యతలు తీసుకున్నారు . ఇలా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు సినిమాలు చేసే సమయం ఏ మాత్రం లేదని చెప్పాలి. అయితే ఈయన కమిట్ అయిన మూడు సినిమాలు కూడా తనకు వీలైనప్పుడు షూటింగ్స్ లో పాల్గొంటూ పూర్తి చేశారు. మరొక మూడు రోజులలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పూర్తి అవుతుందని పవన్ ఇటీవల హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్లలో తెలియజేశారు.


రాజకీయాలలో బిజీ..బిజీ…

ఈ సినిమా జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ కు తదుపరి సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలు చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్న ఎదురయింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు నడిపించాలి అంటే తనకు డబ్బు కావాలి ఆ డబ్బు సినిమాలో నుంచే వస్తుందని ఇదివరకు ఎన్నో సందర్భాలలో తెలియచేశారు.

నిర్మాతగా పవన్ కళ్యాణ్…

ప్రస్తుతం సినిమాలు చేసే సమయం లేకపోవడంతో తదుపరి ఆలోచన ఏంటనే ప్రశ్న ఎదురైనది. దీంతో తాను హీరోగా సినిమాలు చేయనని కచ్చితంగా నిర్మాతగా(Producer) మారి సినిమాలు చేస్తానని నాకు సినిమాలు తప్ప వేరే ఇన్కమ్ సోర్స్ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ అండ్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తానని త్వరలోనే కొత్త సినిమా కూడా అనౌన్స్మెంట్ రాబోతుందని తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీ అవుతున్న నేపథ్యంలోనే వెండితెరపై కాకుండా, తెర వెనక సినిమాలను నడిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయన నిర్మాణంలో రాబోయే సినిమా గురించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఓజీ(OG), ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Fish Venkat: ఫిష్ వెంకట్ ఆఖరి మాటలు.. గుట్కపై చేసిన కామెంట్స్ చూశారా ?

 

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×