Ustaad Bhagat Singh Update : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ముందుగా ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత దీనిని మార్చేశారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్ లో కేటాయించకపోవడం వలన లేట్ అవుతూ వచ్చింది.
ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ చాలామందికి పెరిగింది. దీనికి కారణం వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకోవడం. ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ ఇష్టపడతారో హరీష్ అదే చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్
ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినప్పుడు, అద్భుతమైన కంటెంట్ తీసుకున్నాడు హరీష్ శంకర్. కేవలం అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరు రోజులు మాత్రమే ఇస్తే అదిరిపోయే డైలాగ్స్ తో టీజర్ కట్ చేశాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ అందించారు పవన్ కళ్యాణ్. దాదాపు నేను చేయవలసిన సినిమాలన్నీ పూర్తయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కేవలం ఇంకా నాలుగైదు రోజులు షూటింగ్ ఉంది అంటూ తెలిపారు. మొత్తానికి హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ విముక్తి కలిగించారు అని చెప్పాలి. ఒక తరుణంలో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాని హోల్డ్ లో పెట్టి హరీష్ ఈ గ్యాప్ లో ఇంకో సినిమాను కూడా పూర్తి చేసేసాడు. అదే మిస్టర్ బచ్చన్.
హరీష్ శంకర్ కి కం బ్యాక్ అవుతుంది
రవితేజ హీరోగా రైడ్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో తెరకెక్కించాడు హరీష్. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాకి రివ్యూస్ కూడా నెగిటివ్ గా వచ్చాయి. ఇక ఉస్తాద్ సినిమాతో హరీష్ మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది బిలీవ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సమస్త ఈ సినిమాను నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
Also Read : Idly Kadai : ధనుష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్, భలే సెట్ చేశాడు