Ayesha Khan:ఆయేషా ఖాన్ ..తెలుగు సినిమాలలో పెద్దగా రాణించనప్పటికి మరోసారి తన లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్‌తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది ఈ బీ టౌన్ బ్యూటీ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయ్ మరి. ఓ స్పెషల్ ఈవెంట్‌కు వెళ్లిన సందర్భంగా తీసుకున్న ఫోటోలతో పాటు, దానికి సంబంధించిన అనుభవాలని కూడా క్యాప్షన్ రూపంలో జత చేయడం ఇక్కడ విశేషం.
ఈ పోస్ట్ ని చూస్తే .. హిందీలో “सबकी अपनी अपनी आँखें सबका अपना अपना चाँद” అనే క్యాప్షన్ రాసుకొచ్చింది ఆయేషా ఖాన్.ప్రతి ఒక్కరికీ వారి సొంత చూపు ఉంటుందని, ఒకే అందాన్ని చూసినా, దాన్ని చూసే తీరు ఒక్కొక్కరిలో వేరుగా ఉంటుందనే అర్థం వచ్చేలా ఆయేషా క్యాప్షన్ పెట్టడంతో ఫిదా అయిపోతున్నారు అయేషా ఫాన్స్.
ఇక ప్రముఖ మ్యాగజైన్ ‘ది వర్డ్ మ్యాగజైన్’ కోసం రాత్రి జరిగిన ఈవెంట్ కి అటెండ్ అయ్యానని చెబుతూ ఈ సందర్భంగా తనకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన నందిని భల్లాను స్పెషల్ గా మెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన ఈ అద్భుతమైన లుక్ వెనుక ఎంతోమంది కష్టపడ్డారని,తనకు అండగా నిలిచి ఇంతటి అందమైన లుక్‌ను అందించిన తన టీమ్‌కు ఆమె స్పెషల్ థాంక్స్ చెప్పడం ఇక్కడ విశేషం.
ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే అక్కినేని అఖిల్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేయగా, ఆయేషా కూడా చిన్న పాత్రలో మెరిసిన సంగతి తెల్సిందే.అయితే ఈ భామకి అసలైన గుర్తింపు మాత్రం హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 17’ ద్వారా వచ్చిందనే చెప్పాలి.అంతకుముందు ‘ఎంటీవీ రోడీస్’ లాంటి షోస్ తో క్రేజ్ కొట్టేసి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది కూడా.
ఇకపొతే ప్రస్తుతం సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఒక స్ట్రాంగ్ పబ్లిసిటీ ప్లాట్‌ఫారమ్ అయిపోయిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఆయేషా కూడా ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది కూడా.
మొత్తానికి అందమైన ఫోటోలతో పాటు, తన చుట్టూ ఉన్న టీమ్‌ను మరియు హోస్ట్ చేసిన వాళ్లను మెచ్చుకుంటూ ఆయేషా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి ముందు ముందు ఈ బ్యూటీ తనవైన సినిమాలతో ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో !
ALSO READ :ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!