E-Paper
Advertisement

దేత్తడి హారిక నెల సంపాదన ఎంతో తెలుసా?

దేత్తడి హారిక నెల సంపాదన ఎంతో తెలుసా?
Advertisement

Dethadi Alekhya Harika:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ద్వారానే భారీగా సంపాదిస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా బుల్లితెరపై షోలలో సందడి చేసిన ఎంతోమంది ఇప్పుడు అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా అటు ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఆదాయం కంటే కూడా వీరికి ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయమే మరింత ఎక్కువగా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలాంటి జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి అలేఖ్య హారిక (Dethadi Alekhya Harika) కూడా చేరిపోయింది. సినిమాలలో అవకాశాలు రాకపోయినా ఈమె నెల సంపాదన లక్షల్లో ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

అమెజాన్ ఉద్యోగం వదిలి యూట్యూబర్ గా..

దేత్తడి హారిక ఇండస్ట్రీలోకి రాకముందు అమెజాన్ లో ఉద్యోగం చేసేది. కానీ సినిమాల మీద ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసిన ఈమె.. ఇటు సోషల్ మీడియా , సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి మంచి ప్రజాదారణ సొంతం చేసుకున్న ఈమె.. హౌస్ నుంచి వచ్చిన తర్వాత తన క్రేజ్ ను ఉపయోగించుకొని మరిన్ని అవకాశాలు అందుకుంది.

నెల సంపాదన రూ.8 లక్షలకు పైగానే..

Advertisement

అయితే ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్, సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన ఈమె నెలకు సుమారుగా రూ.8 లక్షలకు పైగా సంపాదిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా సినిమాల ద్వారా సంపాదించలేని మొత్తాన్ని.. ఈమె కేవలం సోషల్ మీడియా, ఆల్బమ్ సాంగ్స్ ద్వారా నెలకు ఈ రేంజ్ లో సంపాదించడం అంటే నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి.

దేత్తడి హారిక కెరియర్..

యూట్యూబ్ ఛానల్ దేత్తడి ద్వారా విపరీతమైన ప్రజాదారణ సొంతం చేసుకున్న హారిక.. తెలంగాణ యాసలో చేసిన స్కెచ్ లు , అందరికీ సులభంగా అర్థమయ్యే కామెడీ కంటెంట్ రిలీజ్ చేస్తూ.. వందల మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. 2019లో వచ్చిన ఆదిత్య వర్మ అనే చిత్రంలో నర్సు పాత్రతో తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈమె.. 2021లో శ్రీకారం, 2022లో మీట్ క్యూట్ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement

ALSO READ:RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!

బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఒకరిగా..

అలా సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఈమె.. 2020లో ప్రసారమైన ఈ షోలో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది.. ప్రస్తుతం డిజిటల్ ఇన్ఫ్లు యెన్సర్ గా కొనసాగుతున్న ఈమె.. అటు ఆల్బమ్ సాంగ్స్ తో ఇటు సినిమాలతో, మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇకపోతే ఈమె విద్య విషయానికి వస్తే.. మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా అందుకుంది.

Related News

బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ కి పీరియడ్స్ వస్తే? విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దక్షి!

జానీ మాస్టర్ పై మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రేష్టి వర్మ!

చామంతి హీరోయిన్ అవుట్.. కారణం ఏంటో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. చింతామణి ప్లాన్ సక్సెస్.. మీనా గ్రేట్..

Karthika Deepam 2 Serial Today Episode October 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పెద్ద షాక్ ఇచ్చిన జ్యోత్స్న  

Podarillu Today Episode : నిజం తెలిసి కన్నీళ్లు.. అయ్యో పాపం కన్నా.. ఇంట్లో నుంచి మహా వెళ్తుందా..?

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ

Big Stories

Advertisement
×