E-Paper
Advertisement

RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!

RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!
Advertisement

RC 17 Movie: గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan) ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) చేసిన ‘రంగస్థలం’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు? ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపుదిద్దుకుంటుంది ? రంగస్థలం సీక్వెల్ తీస్తున్నారా? లేక కొత్త కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారా? ఇందులో తారాగణం ఎవరు? ఇలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

RC 17 మూవీ పూజా కార్యక్రమానికి డేట్ ఫిక్స్.

అయితే పెద్ది సినిమా షూటింగ్లో తన చేతి మణికట్టుకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న రామ్ చరణ్.. కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యంగా ఉండడంతో ఆర్సి 17 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ సీరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కోసం ఒక కొత్త ఆఫీస్ ని స్థాపిస్తూ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఇప్పుడు ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

అనుకున్న టైం కి జరుగుతుందా?

Advertisement

విషయంలోకి వెళ్తే.. ఆర్సీ 17 చిత్రాన్ని టి- సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదే నిర్మాణ సంస్థలో అక్టోబర్ 23న థియేటర్లలోకి వచ్చిన ఇంటెన్స్ హారర్ మూవీ 418 ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో చరణ్, సుకుమార్ మూవీ అప్డేట్ ను పంచుకున్నారు. నవంబర్ ఒకటవ తేదీన ఆర్సీ 17 పూజా కార్యక్రమం జరుగుతుందని మైత్రి నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ఇక అక్కడి నుంచి సినిమా కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.

also read : బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ కి పీరియడ్స్ వస్తే? విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దక్షి!

నిర్మాత ఏమన్నారంటే?

Advertisement

ఈ నేపథ్యంలోనే రవిశంకర్ మాట్లాడుతూ.. “ఆర్సి 17 సినిమా పూజా కార్యక్రమాలను దసరా పండుగకి నిర్వహించాలని అనుకున్నాము. కానీ మూఢం ఉండడంతో కుదరలేదు. అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో పూజ చేద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడు నవంబర్ 1వ తేదీన మూవీ లాంచ్ ఉంటుంది అంటూ స్పష్టం చేశారు. మరి ఈసారైనా చెప్పిన డేట్ కి సినిమా ఓపెనింగ్ ఉంటుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ తో సంగీతం ఇప్పించాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే అన్ని విషయాలను ఫైనలైజ్ చేస్తామని నిర్మాతలు ఇటీవల తెలిపారు. ఏది ఏమైనా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాదులో గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు.

Related News

బిగ్‌బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కొత్త లుక్.. చీరలో ఇంత అందంగా ఉందేంటి!

ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!

జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్

నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×