E-Paper
Advertisement

జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్

జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్
Advertisement

Janhvi Kapoor:పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ గ్లామర్ షో మరీ ఎక్కువైందంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో చెప్పక్కర్లేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి చరణ్ నటన మీద వచ్చిన ప్రశంసల కన్నా సినిమాలో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో అసభ్యకరంగా ఉందంటూ వచ్చిన ట్రోలింగ్, కామెంట్స్ ఎక్కువ.ఇదిలా తాజాగా మరో సారి జాన్వీ పెద్ది ఇష్యూ పై కాఫీ కరణ్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అవడంతో నెటిజన్లు జాన్వీని గట్టిగానే టార్గెట్ చేశారు.అంతకు మించి ఎక్స్పోజింగ్ చేసిన వీడియోని షేర్ చేస్తూ మరి ఇదేంటి బాలీవుడ్ అంత పవిత్రమా? అంటూ ఏకిపారేస్తున్నారు.

కరణ్ జోహార్ షోలో జాన్వీ 

Advertisement

తాజాగా కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ ,వరుణ్ ధావన్ గెస్ట్ లుగా వచ్చారు.ఈ క్రమంలో పెద్ది సినిమాలో తనపై వచ్చిన కామెంట్స్ ,ట్రోలింగ్స్ పై మాట్లాడుతూ అలా తనని హద్దులు దాటి మరి చూపిస్తున్నారని తనకు కూడా తెలుసనీ,అయితే సినిమాకి కొన్ని వందల మంది పని చేస్తుంటారని, అలా ఉన్నపళంగా ఆ సమయంలో నో అని చెప్పలేకపోయానని వాపోయింది.

అయితే అప్పుడే తనకున్న బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకుని నిలదీయాల్సి ఉండాల్సింది అని మనసులోని మాటని బయటపెట్టింది.ఒక రకంగా తన పాత్రని చూపించిన తీరు మహిళల పట్ల సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుందని చెప్పుకొచ్చింది. ఇదిగో ఇలా జన్వీ చెప్పిందో లేదో ట్రోలర్స్ తమ కామెంట్స్ కి పని పెట్టశారు.

Advertisement

బాలీవుడ్ ఎంతో పవిత్రం అయినట్టు

బాలీవుడ్ లో అంతకు మించి గ్లామర్ షోలు జాన్వీ బోలెడు చేసిందని ఒక వీడియో షేర్ చేస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు.ఇక జాన్వీ ఇంస్టా, ఫేస్ బుక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే అంతకు మించిన అసభ్యకర సీన్స్ ఎన్నో ఉంటాయని,అలాంటి ఎదో బాలీవుడ్ ఎంతో పవిత్రం అయినట్టు, టాలీవుడ్ మొత్తం అపవిత్రం అయినట్టుగా బిల్డప్ ఇవ్వడం ఏమీ బాగోలేదంటూ మండిపడుతున్నారు.

పైగా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడు బాధితురాలిగా మాట్లాడటం ఏంటని , కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకున్నప్పుడు జరిగిన దాంట్లో కూడా తన బాధ్యత ఉంటుందని అలాంటిది తనకేమీ పట్టనట్టు మొత్తం టాలీవుడ్ పైనే తోసేయడం ఏమీ బాగోలేదని ఫైర్ అవుతున్నారు.

 సీన్ల గురించి మాట్లాడటం విడ్డూరం

పైగా కరణ్ జోహార్ తన షోలో ఆడవారిని ఎంత అసభ్యకరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడో అందరికి తెలుసనీ,మరీ ముఖ్యంగా పెళ్లయిన హీరోలు, హీరోయిన్లను ఉద్దేశించి వారి వారి వ్యక్తిగత జీవితాలపై ఎంతటి చెత్త క్వశ్చన్ అడుగుతాడో తెలీందేం కాదని, అలాంటి ఈ షోలో కరణ్ పెద్ది సినిమాలోని సీన్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఎకిపారేశారు.

ఇక షారుఖ్ ఖాన్ నటించిన బాజీగర్ సినిమాలో చంపే వ్యక్తిని హీరోగా చూపించారని,బికినీ సీన్స్ తో ఆడవాళ్ళ శరీరాలని గ్లామర్ కోసమే పనికి వస్తాయన్నట్టుగా చూపించారని, బాలీవుడ్‌కు అండర్‌వరల్డ్‌తో ఉన్న సంబంధాలపై గతంలో వచ్చిన వివాదాలను హైలెట్ చేస్తూ మండిపడ్డారు.

మొత్తానికి కాఫీ విత్ కరణ్ షోతో జాన్వీ కపూర్ మరోసారి మర్చిపోయిన వివాదాలకి మళ్ళీ ఆజ్యం పోసినట్టయింది,చూడాలి మరి ముందు ముందు ఈ కాంట్రవర్సీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !

also read:నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

Tags

Related News

నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!

Big Stories

Advertisement
×