E-Paper
Advertisement

ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!

ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!
Advertisement

Spirit Movie:ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సందీప్ వంగా, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ మూవీ లవర్స్ లో రోజురోజుకు పెరిగిపోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారడం ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపొయింది.ఏకంగా ఈ సినిమాని 2027 దీపావళికి పోస్ట్ పోన్ చేయడం,అదే సమయంలో రణ్‌బీర్ కపూర్ నటించే ‘రామాయణం పార్ట్ 2’ రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదా అంటూ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

నిజానికి స్పిరిట్ విడుదల పై మొదటి నుంచీ డైలమానే. గతంలో మార్చి 5, 2027న ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశాడు సందీప్ వంగ.కానీ ఇపుడు దీపావళి పండుగ సీజన్‌ను టార్గెట్ గా అక్టోబర్ 29, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభాస్ కాల్షీట్లు ఇవ్వకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.ఒక వైపు ఫౌజీ ,మరోవైపు కల్కి 2 షూట్స్ జోరుగా నడుస్తుండటంతో స్పిరిట్ సినిమాకి అనుకున్నంతగా డేట్స్ ఇవ్వలేకపోయాడని,అందువల్లే స్పిరిట్ సినిమా ఇలా పోస్ట్ పోన్ అయిందని ఇన్ సైడ్ టాక్ జోరుగా నడుస్తుంది.మరి ఇందులో నిజమెంత ఉందో మేకర్స్ బయటపెడితే కాని తెలీదు.

మరోవైపు, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం పార్ట్ 2’ కూడా 2027 దీపావళి రేసులోనే ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందులో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ఈ సినిమా రెండు పార్ట్స్ గా దాదాపు 4000కోట్లతో తెరకక్కుతుందంటూ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేసుకున్నారు ఆడియన్స్.ఇక ఈ దీపావళికి 1st పార్ట్ వచ్చేందుకు రెడీ అవుతుంది కూడా.

Advertisement

ఒకవేళ స్పిరిట్, రామాయణం పార్ట్ 2 ఒకే పండుగ సీజన్ లో వస్తే బాక్సాఫీస్ దగ్గర కాంపిటీషన్ మాత్రం మాములుగా ఉండదు. అయితే ఇవి రెండూ ఒకే రోజున వస్తాయా లేక సీజన్ లోనే వేర్వేరు తేదీలని ఎంచుకుంటాయా చూడాలి.ఏది ఏమైనా ఈ పోటీపై క్లారిటీ అనేది రామాయణ పార్ట్ 2 రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ తెలిసేలా లేదు.

ఇక ఈ రెండు సినిమాల విషయానికి వస్తే స్పిరిట్ ఒక యాక్షన్ డ్రామాగా వస్తుంటే రామాయణం ఒక విజువల్ వండర్‌గా రానుందన్న సంగతి తెల్సిందే. ఏదేమైనా ప్రభాస్, రణ్‌బీర్ కపూర్ వంటి ఇద్దరు పెద్ద స్టార్ల సినిమాలు ఒకే సీజన్‌లో పోటీ పడటం అనేది మూవీ లవర్స్ కి ఒక ఫెస్టివల్ అనే చెప్పాలి. చూడాలి మరి ఒకేసారి బాక్సాఫీస్ పై గనుక ఈ రెండు సినిమాలు ఎటాక్ చేస్తే ఏది సత్తా చాటుతుందో!

ALSO READ :జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్

Tags

Related News

మైనస్ నుంచి జీరోకి.. సుమతో కలిసి రాజీవ్ కనకాల పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లే!

బిగ్‌బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కొత్త లుక్.. చీరలో ఇంత అందంగా ఉందేంటి!

RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!

జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్

నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×