E-Paper
Advertisement

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!

మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!
Advertisement

Mailu Rayi Movie:హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నాగబాబు చేతుల మీదుగా మైలురాయి టైటిల్ లాంచ్..

తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు (Nagababu) విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టైటిల్ ‘మైలురాయి’ చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక (Producer Hansika) మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం.

లేడీ ప్రొడ్యూసర్స్ పై నాగబాబు ప్రశంసలు..

Advertisement

ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ గారి కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

నా తొలి నిర్మాణంలో మూవీ.. ఆశీర్వదించండి – ప్రొడ్యూసర్ హన్సిక

నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.

Advertisement

సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ.. ‘మైలురాయి’ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన నాగబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

also read:చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

త్వరలో టీజర్ , ట్రైలర్ విడుదల..

హీరో జగన్ యోగిరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. నాగబాబు గారు విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే టీజర్, పాటలు, ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.

ఇండస్ట్రీకి మరో నూతన దర్శకుడు..

దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. ‘‘హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. ‘మైలురాయి’ భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని తెలిపారు.

నటీనటులు : జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల, దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్.
బ్యానర్ : హన్సి ప్రొడక్షన్స్
సమర్పణ : డా. శ్రీధర్ పెద్దిరెడ్డి
నిర్మాత : శ్రీ హన్సిక పెద్దిరెడ్డి
సహ నిర్మాత : తవిటిరాజు తలచింతల
రచన, దర్శకత్వం : రఘువర్ధన్ కోట్ల
సినిమాటోగ్రాఫర్ : సాయి వంశీ దాచపల్లి
ఎడిటర్ : ఉదయకిరణ్ ఏవీ
సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీపాల్ మాచర్ల
లిరిసిస్టులు : నాగేంద్ర గోపు, మనోజ్ జులోరి
పీఆర్వో : GK Media (గణేష్, కుమార్)

Related News

నాని – చిరంజీవి – ఓదెల.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందా? టాలీవుడ్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

వామ్మో.. అదా శర్మలో ఇంత టాలెంట్ ఉందా.. మొన్న అలా.. నిన్న ఇలా..

జోరు పెంచిన నిహారిక.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ‘పాకెట్ రాకెట్స్’!

కారవాన్ లోకి వెళ్తే ఛీ కొట్టారు.. స్టార్ హీరోయిన్ పై వైష్ణవి చైతన్య కామెంట్స్!l

Big Stories

Advertisement
×