Rajeev Kanakala:రాజీవ్ కనకాల..పరిచయం అక్కరలేని పేరు.ఎన్నో సినిమాలలో తనవైన పాత్రలతో మెప్పించిన రాజీవ్ కనకాల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు.తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
ఒకానొక సమయంలో తన జీవితం ‘మైనస్’ నుంచి ప్రారంభమైందని, తండ్రి దేవదాస్ కనకాల చేసిన అప్పుల కారణంగా చాలా ఏళ్ల పాటు తీవ్రమైన ఫైనాన్షియల్ గా తెరుకోలేకపోయామని చెప్పారు. వచ్చిన సంపాదన అంతా ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోయేదని, ఆ తర్వాత అసలు కూడా తీర్చుకుంటూ వచ్చామని చెప్పుకొచ్చారు. అప్పులు తీర్చడం అనేది ఒక్క రోజులోనో లేదా కొన్ని నెలల్లోనో అయిపోలేదని ఎల్లకేళ్ళు కట్టి ఇపుడు స్థిరపడ్డామని వివరించారు.
ఇక ఈ కష్టకాలంలో తన భార్య సుమ అందించిన సహకారం ఎంతో గొప్పదని గుర్తుచేసుకున్నారు. కెరీర్ మొదట్లో మోతీనగర్‌లో ఉన్నప్పుడు ప్రతి రూపాయికీ లెక్క రాసుకునేవాళ్ళమని, ఇంటి రెంట్ ,ఇంట్లోకి కావాల్సిన సరుకులు, ని కరెంటు బిల్లులు ఇలా అన్నింటి ఖర్చులు పోనూ మిగిలిన డబ్బులను ఏ అప్పు తీర్చడానికి వాడాలో ఇద్దరూ రాత్రి పూట కూర్చొని లెక్కలు వేసుకునేవాళ్ళమని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారుఒకప్పుడు రోజుకు రూ. 3,500 సంపాదించినా చాలా సంతోషంగా ఉండేవాళ్లమని, ఆదాయం పెరిగే కొద్దీ బాధ్యతలు, ఖర్చులు కూడా పెరుగుతాయని అన్నారు. కేవలం సంపాదించడమే కాకుండా, వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెడతామనేది జీవితంలో ముఖ్యమని ఈ సందర్భంగా చెప్పారు.
ఇక తన తండ్రి దేవదాస్ కనకాల జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతుంటాయని ఎమోషనల్ అయ్యారు. తండ్రి లాగే డ్రెస్ చేసుకోవడం ,ఆయనలాగే తినడం, అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన పోలికలు కనిపించడం వంటివి తమ మధ్య ఉన్నఅనుబంధాన్ని గుర్తుచేస్తుంటాయని అన్నారు. తండ్రి పెట్టిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆయన ఎంతోమంది విద్యార్థులకు ఫ్రీగా చదువును,ఫుడ్ ని అందించారని తెలిపారు. తండ్రి చేసిన ఆ సేవలు, సంపాదించిన మంచి పేరే ఈ రోజు తమ కుటుంబానికి గౌరవాన్ని ఇస్తున్నాయని గర్వంగా చెప్పారు రాజీవ్ కనకాల .
అలాగే తన భార్య సుమ పనిరాక్షసి అని, చేసే పనిపట్ల ఎంతో డెడికేషన్ చూపిస్తూనే ఇంటిని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందని ఆకాశానికి ఎత్తేశాడు. సుమ చేసే మంచి పనుల గురించి చెబుతూ ఎంతో మందికి చదువులు అని,ఆస్పత్రులు అని సాయం చేస్తూనే ఉంటుందని తెలిపారు.అయితే మొదట్లో ఎదురైన అనుభవాల వల్ల నిజానిజాలు ఏమిటి అని నిర్ణయించుకున్నాకే చేస్తున్నామని తెలిపారు.మొత్తంగా రాజీవ్ ఆనాటి రోజులని తలుచుకుంటూ చెప్పిన ఈ మాటలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి !
ALSO READ :బిగ్‌బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కొత్త లుక్.. చీరలో ఇంత అందంగా ఉందేంటి!