E-Paper
Advertisement

తారక్‌ను గ్లోబల్ స్టార్ అవుతావని ముందే చెప్పా.. రాజీవ్ కనకాల!

తారక్‌ను గ్లోబల్ స్టార్ అవుతావని ముందే చెప్పా.. రాజీవ్ కనకాల!
Advertisement

Jr NTR:యంగ్ టైగర్ తారక్, రాజమౌళి, రాజీవ్ కనకాల మధ్య ఉన్న అనుబంధం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతో మొదలైన ఈ జర్నీ ఇప్పటికీ హెల్దీ గా కంటిన్యూ అవుతుండటం విశేషం. ఇక ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల ‘స్టూడెంట్ నంబర్ 1 జ్ఞాపకాలని,తారక్ ఎమోషనల్ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చాడు.

‘శాంతి నివాసం’ సీరియల్ అప్పుడే రాజీవ్ కనకాలకి రాజమౌళితో పరిచయమైన సంగతి తెల్సిందే.ఇక ఆ పరిచయమే రాజీవ్‌కు ‘స్టూడెంట్ నంబర్ 1’లో నటించే చాన్స్ తెచ్చింది కూడా.ఇక ఆ స్టూడెంట్ నంబర్ 1’ షూటింగ్ రోజుల్లో జరిగిన విషయాలని మళ్ళీ నెమరు వేసుకున్నాడు రాజీవ్.

Advertisement

యూనిట్ అంతా చాలా కష్టపడేవారని, ఫైట్ మాస్టర్ లేకపోయినా ప్రతి సీన్ బాగా రావడం కోసం అందరూ కలిసి డిస్కస్ చేసుకుని పని చేసేవాళ్ళమని తెలిపాడు. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు నిజంగానే కిందపడటం, దెబ్బలు తగలడం లాంటివి జరిగేవని, అయినా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో పట్టుదలతో పనిచేసేవారని ఆరోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

షూటింగ్ అయి మొదటి వారం అయిందో లేదో తారక్, రాజీవ్ కనకాల మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. ఆ సమయంలో ఒకరోజు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ “రాజా.. ఈ సినిమా నిజంగానే హిట్ అవుతుందంటావా? నాకు మంచి భవిష్యత్తు ఉంటుందా?” అని కళ్లల్లో నీళ్లతో అడిగాడని చెప్పుకొచ్చాడు రాజీవ్.

Advertisement

అప్పుడు రాజీవ్ ధైర్యం చెప్తూ, “కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్ అవుతావు, ఆఖరికి మమ్మల్ని కూడా మర్చిపోయేంత ఎత్తుకు ఎదుగుతావు” అని సరదాగా, ప్రేమగా చెప్పానని తెలిపాడు. నాడు స్నేహితుడిగా రాజీవ్ చెప్పిన ఆ మాటలు, 17 ఏళ్ల తర్వాత తారక్ గ్లోబల్ స్టార్‌గా ఎదగడంతో నిజమయ్యాయని, ఎంత ఎదిగినా తారక్ పాత అనుబంధాలను, పరిచయాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడం తనకి ఎంతో సంతోషాన్నిస్తుందని ఎమోషనల్ అయ్యాడు.

ఇక అప్పట్లోనే ఎన్టీఆర్ ఎనర్జీ మామూలుగా ఉండేది కాదని ,ఎంత కష్టమైన సీన్ అయినా, షూటింగ్‌లో దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకుండా చేసేవారని గుర్తుచేసుకున్నాడు. అటు రాజమౌళి గురించి చెప్తూ.. ఆయన ఎంత పెద్ద విజయాలు సాధించినా ఎంతో సాదాసీదాగా ఉంటారని, సెట్‌లో చిన్న పని ఉన్నా స్వయంగా చేసుకుంటారని తెలిపారు. సినిమా పట్ల ఉన్న ఆ డెడికేషనే
రాజమౌళిని ఈరోజు ప్యాన్ ఇండియా డైరెక్టర్ ని చేసిందని ఆకాశానికి ఎత్తేశాడు.

అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంటూ ఒక దశలో తల్లిదండ్రులను, చెల్లిని కోల్పోవడం వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని, శారీరక ఇబ్బందులు, మోకాలి సమస్యల వల్ల బరువు ఏకంగా 126 కిలోలకు పెరిగిపోయానని బాధ పడిపోయాడు. ఆ సమయంలో సరైన సినిమాలు రాకపోవడం వల్ల కెరీర్ స్లో అయిందని,అయినా ఎక్కడా చిన్న పాత్రలైనా సరే చేస్తూ ముందుకు సాగానని చెప్పాడు.

ఇప్పుడు కొత్త తరం దర్శకులు తన కోసం స్పెషల్ రోల్స్ రాయడం, మళ్లీ వరస అవకాశాలు రావడం తనకు ఎంతో తృప్తినిస్తోందని చెప్పారు. మొత్తంగా ‘స్టూడెంట్ నంబర్ 1’లో తారక్ ని పెద్ద స్టార్ అవుతాడని అనడం,తారక్ నిజంగానే పెద్ద స్టార్ అయిపోవడంతో రాజీవ్ మాటలు నిజమయ్యాయిగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు తారక్ ఫాన్స్ !

ALSO READ :మైనస్ నుంచి జీరోకి.. సుమతో కలిసి రాజీవ్ కనకాల పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లే!

Tags

Related News

అర్జున్ రెడ్డి బ్యూటీ అందాల షో.. మామూలుగా లేదుగా!

ఇళయరాజా, భారతీరాజా మధ్య గొడవకు కారణం అదేనా?

మైనస్ నుంచి జీరోకి.. సుమతో కలిసి రాజీవ్ కనకాల పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లే!

బిగ్‌బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కొత్త లుక్.. చీరలో ఇంత అందంగా ఉందేంటి!

ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!

RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!

జాహ్నవీ ఇదేంటీ? బాలీవుడ్ అంత పవిత్రమా? ఆ సీన్ షేర్ చేసి మరీ నెటిజన్స్ ఫైర్

Big Stories

Advertisement
×