BigTV English
Advertisement

Ayesha khan : ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయాను.. నడిరోడ్డుపైనే తాకుతూ..

Ayesha khan : ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయాను.. నడిరోడ్డుపైనే తాకుతూ..

Ayesha khan : ఒకప్పుడు సినిమాల్లో నటించే నటీనటులు తమకు ఎదురైనా చేదు అనుభవాలనే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు.. ఎప్పుడైతే కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఉద్యమం జరిగిందో అప్పుడు నుంచి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయట పెడుతూ వస్తున్నారు. ఈమధ్య పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న ముద్దుగుమ్మలు తమపై జరిగిన అఘాయిత్యాలా గురించి బయట పెడుతూ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నారు.. తాజాగా మరో హీరోయిన్ తనకి ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది.. ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయినట్లు ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మరెవ్వరో కాదు. శ్రీవిష్ణు ఓం భీమ్ బుస్ మూవీలో నటించిన అయేషా ఖాన్.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..


బాబాయ్ చేతిలో దారుణంగా మోసపోయాను.. 

ఈ మధ్య ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే తల్లిదండ్రుల మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా తమ పిల్లల్ని తీసుకెళ్తారా అని భయం వాళ్ళకి కలుగుతుంది.. ఈరోజుల్లో జరుగుతున్న సంఘటనలు అలా తల్లిదండ్రులని కలవర పెట్టేస్తున్నాయి.. బయట వాళ్లతో ఇబ్బంది అని అనుకోవడం తప్పు.. వావి వరుసలు మరిచిపోయి సొంతింట్లో వాళ్లే కాలనాగు లాగా కాటేస్తున్న ఘటనలు ఎన్నో వింటూనే ఉన్నాం.. ఆఖరికి సెలబ్రిటీలు సైతం అలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. తాజాగా ఓం బీమ్ బుష్ నటి అయేషా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా పేదరికం నా ఆశలని చంపేసింది. ఓ రోజు మా నాన్నగారి ఫ్రెండు పిలిస్తే వెళ్లాను.. ఆయనను నేను బాబాయిని పిలుస్తాను. నీ వక్షోజాలు బాగున్నాయని అసభ్యంగా మాట్లాడాడు. నా ప్రైవేట్ పార్ట్ పై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు.. కొంత దూరం వెళ్లి నాకు కన్ను కొట్టి అసభ్యంగా సైగలు చేశాడు.. అది చూసిన నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే కళ్ల వెంట ఆగకుండా నీరొస్తుందని ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

హిందీ బిగ్ బాస్ తో క్రేజ్…

నటి అయేషా ఖాన్ బుల్లితెరపై పలు సీరియల్స్ తో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత రియాల్టీ షో బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. దాదాపు 11 వారాలపాటు ఆమె హౌస్ లో తన ఆటతీరుతో కొనసాగింది. 97వ రోజున ఆయేషా ఖాన్ ఎలిమినేట్ అయ్యింది.. బిగ్ బాస్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది.


అయేషా నటించిన సినిమాలు.. 

ముఖ చిత్రం సినిమాతో తెలుగు వారిని పలకరించింది. ఆ తర్వాత చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో నటించింది. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ మూవీ లో చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ మూవీ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది.. ఆ తర్వాత లక్కీ భాస్కర్, మనమే, జాట్, కిస్ కిసికో ప్యార్ కరూన్ 2లో ఆమె నటించారు.. ఇక అయేషా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.

Related News

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?

Pawan Kalyan Next Movie : స్టార్ నిర్మాత నుంచి పవన్ కళ్యాణ్‌కు 20 కోట్ల అడ్వాన్స్?

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Star Kid’s: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్స్.. ఎవరెవరంటే ?

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

Idly Kottu: ఓటీటీకి స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు.. ఎక్కడ చూడొచ్చు అంటే

Big Stories

×