Star Kid’s: సినిమా ఇండస్ట్రీలో ఒకతరం హీరో హీరోయిన్లు రాణించారంటే కచ్చితంగా వారి వారసత్వం నెక్స్ట్ జనరేషన్ లో కనిపిస్తుంది. అలా ఇప్పటికే మనం సినీ ఇండస్ట్రీలో ఎంతోమందిని చూసాం. ముఖ్యంగా చూసుకుంటే ఏఎన్ఆర్ (ANR), ఎన్టీఆర్(NTR), కృష్ణ(Krishna)ల తర్వాత వారి వారసత్వంగా నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబులు వచ్చారు. నాగార్జున వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి, మెగా, ఘట్టమనేని, నందమూరి, అక్కినేని హీరోల వారసత్వం రాణిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న హీరో హీరోయిన్ ల నుండి కూడా నెక్స్ట్ తరం నటీనటులు ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. అలా మహేష్ బాబు, రోజా (Roja), సుధీర్ బాబు, రవితేజ ల కొడుకులు, కూతుర్లు సినిమాల్లోకి రాబోతున్నారు. మరి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో హీరోయిన్ల కూతుర్లు ఎవరూ అనేది ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు కూతురు సితార(Sithara) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈమె ఏజ్ తక్కువే అయినప్పటికీ చూడడానికి ఇప్పటికే హీరోయిన్ మెటీరియల్ లా ఉండడంతో ఈమె సినిమాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం తన కూతురు సినీ ఎంట్రీపై ఇప్పటివరకైతే స్పందించలేదు.
అటు మహేష్ బాబు మేనకోడలు.. మంజుల కూతురు జాన్వీ స్వరూప్(Janhvi Swaroop) మాత్రం సినిమాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సోదరి మంజుల కూతురే జాన్వీ స్వరూప్..ఈ ముద్దుగుమ్మ గతంలో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.త్వరలోనే సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అలా జాన్వీ స్వరూప్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ కూడా ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
ALSO READ:Rajendra Prasad : ఓపెన్ ఛాలెంజ్.. అలా జరగకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా!
మహేష్ బాబు బావ, నటుడు సుధీర్ బాబు కొడుకు దర్శన్ (Darshan) ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) నిర్మిస్తున్న అడివి శేష్ గూడచారి -2 లో కూడా దర్శన్ ఓ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
సీనియర్ నటీమణి రోజా కూతురు అన్షు మాలిక కూడా సినిమాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపించాయి. మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా మొదట అన్షు పేరే వినిపించింది.కానీ ప్రస్తుతం అన్షు స్టడీస్ లో బిజీగా ఉండడం వల్ల సినిమాల్లోకి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే అన్షు మాలిక(Anshu Malika)కి సంబంధించిన హాట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేశాయి.ఈ ఫొటోస్ చూస్తే మాత్రం నెక్స్ట్ ఇండస్ట్రీని ఏలబోయే హీరోయిన్ రోజా కూతురే అని చాలామంది కామెంట్లు చేశారు.
మాస్ మహారాజా రవితేజ (Raviteja)కొడుకు, కూతురు ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.కానీ హీరో హీరోయిన్లుగా మాత్రం కాదు. కొడుకు మహాధన్ (Mahadhan) దర్శకత్వరంగం ద్వారా ఎంట్రీ ఇస్తూ ఉంటే.. కూతురు మోక్షధ నిర్మాణరంగం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే రవితేజ కొడుకు మహాధన్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి సూర్య నెక్స్ట్ మూవీకి వర్క్ చేస్తున్నారట. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ స్పిరిట్ మూవీకి కూడా దర్శకత్వ విభాగంలో వర్క్ చేస్తున్నట్టు టాక్.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) బాటలోనే ఆయన కొడుకు రిషి మనోజ్ కూడా దర్శకత్వ రంగాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీకి రిషి మనోజ్ (Rishi Manoj)సహాయ దర్శకుడిగా చేస్తున్నట్టు సమాచారం.
ఇక వీళ్లే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రీకాంత్ ఊహల కూతురు మేధ. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కొడుకు, కూతురు జయకృష్ణ భారతి, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కూతురు సుహానా ఖాన్, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.