E-Paper
Advertisement

సుప్రీంకోర్టుకు చేరిన బండ్ల గణేశ్ ఆస్తుల వివాదం.. వచ్చే సోమవారం ఏం జరగనుందో ?

సుప్రీంకోర్టుకు చేరిన బండ్ల గణేశ్ ఆస్తుల వివాదం.. వచ్చే సోమవారం ఏం జరగనుందో ?
Advertisement

Bandla Ganesh:ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన బండ్ల గణేష్ ఇప్పుడు వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు .విషయంలోకి వస్తే తన పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు బండ్ల గణేష్.

వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల

Advertisement

అయితే అందుకోసం తన మరియు కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆస్తులను కూడా పూచీకత్తుగా పెట్టాడు.కానీ వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల తిరిగి అనుకున్న టైంలో కట్టలేకపోయాడు బండ గణేష్.దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బండ్ల గణేష్ ఆస్తులని వేలం వేసింది .ఇక్కడే మండింది బండ్ల గణేష్ కి .ఉండాల్సిన విలువ కన్నా తక్కువ రేటుకి వేలం వేస్తున్నారంటూ,తన సొంత ఆస్తులను బ్యాంకు వేలం వెయ్యడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మొదట డెబ్ట్స్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు బండ్ల.

అక్కడ ఆయనకి కాస్త రిలీఫ్ దొరికింది. బ్యాంకు జరిపిన వేలం చట్టబద్ధం కాదంటూ ట్రైబ్యునల్‌ ఆ వేలాన్ని రద్దు చేసింది.అంతేకాదు వేలంలో ఆస్తులను కొనుక్కున్న వ్యక్తికి వడ్డీతో సహా డబ్బును ముట్టచెప్పాలని, బండ్ల గణేష్ ఆస్తులని ఆయనకే తిరిగి అప్పగించాలని తేల్చి చెప్పింది .

Advertisement

బండ్ల గణేష్ కి గట్టి దెబ్బ

అయితే డీఆర్టీ బండ్ల గణేష్ కి  ఇచ్చిన రిలీఫ్ ఎంతో కాలం నిలవలేదు.కారణం  ట్రైబ్యునల్ ఇచ్చిన షాకింగ్ తీర్పుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది.పిటీషన్ ని విచారించిన తెలంగాణ హైకోర్టు డీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేసింది .బ్యాంకు తీసుకున్న వేలం చర్యలను హైకోర్టు సపోర్ట్ చేయడంతో బండ్ల గణేష్ కి గట్టి దెబ్బ తగిలింది.

ఇక హైకోర్టు నుండి వచ్చిన తీర్పుతో ఒక్కసారిగా షాక్ గురైన బండ్ల తగ్గేదేలే అంటూ తన న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించాడు.ఇందులో భాగంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు బండ్ల.ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ వచ్చే సోమవారం విచారణకు రానుందట.

ఎలాంటి మలుపులు తీసుకుంటుందో !

ఇక గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, తీన్మార్, ఎన్టీఆర్ తో బాద్ షా,రాంచరణ్ తో గోవిందుడు అందరివాడేలే వంటి బడా బడా  సినిమాలు నిర్మించి ఒక వెలుగు వెలిగిన బండ్ల పౌల్ట్రీ వ్యాపారంలోని చాలా ఏళ్ల నుండి ఉన్న సంగతి తెలిసిందే .చూడాలి మరి సోమవారం విచారణకు రానున్న బండ్ల వారి వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో !

also read :సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×