E-Paper
Advertisement

సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !

సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !
Advertisement

Pooja Hegde: బుట్ట బొమ్మగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ చాలామంది కంటే వంద రేట్లు బెటర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది.అంతే కాదండోయ్ ..పనిలో పనిగా మిగతా వాళ్ళు కుళ్ళు కుతంత్రాల ప్లానింగ్ లో బిజీగా ఉంటారని సల్లూ భాయ్ కి మాత్రం అలాంటివి ఏమీ తెలియదని సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది.ఇక ఇప్పుడు ఈ అమ్మడు చేసిన ఈ  కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ (2023) లో నటించిన పూజ

Advertisement

మామూలుగా సల్మాన్ ఖాన్ అంటే కోపానికి కేరాఫ్ అని బీ టౌన్ లో టాక్.కానీ ఆయనతో కలిసి కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‘ (2023) సినిమాల్లో నటించిన పూజ మాత్రం సల్మాన్ ఖాన్ చాలా మంచోడంటూ కితాబిచ్చేస్తుంది.ఇండస్ట్రీలో సగం మంది హీరోలు పక్కన వాళని ఎలా తొక్కలా అని రాత్రింబవళ్లు ఆలోచిస్తుంటే సల్మాన్ ఖాన్ కి మాత్రం అలాంటి ఆలోచనలే ఉండవని ,మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడమే సల్మాన్ స్టైల్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది .

అంతేకాదు అలా ఉండడానికి చాలా గుండె ధైర్యం కావాలంటూ మెచ్చేసుకుంది.ఇక  మిగతా హీరోల గురించి మాట్లాడుతూ..ఇంత హీరోల గురించి మాట్లాడుతూ మొహెంజోదారో‘ (2016) లాంటి డిజాస్టర్ సినిమాలో  కలిసి నటించిన  గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నుంచి డాన్స్ చేసేటప్పుడు మ్యూజిక్ ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది .ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ అంటేనే తిండి తిండి అంటేనే ప్రభాస్ అన్నట్టుగా ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఎక్కువ పొగిడేసింది ఈ బుట్ట బొమ్మ .

Advertisement

‘రాధే శ్యామ్’ (2022) సినిమా ఈ భామకి  గుర్తుందో లేదో

బహుశా వీరిద్దరూ కలిసి నటించిన రాధే శ్యామ్‘ (2022) సినిమా ఈ భామకి  గుర్తుందో లేదో.ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే మహర్షి, అలవైకుంఠపురంలో అంటూ స్టార్స్ సరసన  నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లందరికీ ఒకప్పుడు మోస్ట్ అవైటెడ్ హీరోయిన్.కానీ ఎప్పుడైతే గురూజీ గుంటూరు కారం సినిమా నుంచి ఎగ్జిట్ ఇచ్చిందో అప్పటినుంచి టాలీవుడ్ ఈ అమ్మడిని కాస్త దూరం పెట్టినట్టే కనిపిస్తుంది.బహుశా వరుస ప్లాపులు రావడంతో ఐరన్ లెగ్ స్టాంప్ వేసి పక్కన పెట్టారు కాబోలు.

సల్లు బాయ్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !

టాలీవుడ్ పక్కన పెడితేనేం …కోలీవుడ్, బాలీవుడ్ అంటూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది ఈ భామ .ముఖ్యంగా దళపతి విజయ్ తన కెరీర్ లో చివరిగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ పూజానే.చూడాలి మరి త్వరలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్న ఈ సినిమా ఈ అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో .ఏది ఏమైనా ఇండస్ట్రీలో హీరోల కుట్రల గురించి పూజ భామ వేసిన సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .చూడాలి వీటికి సల్లు బాయ్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !

also read :“ఇప్పుడే బయటకొచ్చా.. మళ్లీ అరెస్ట్ చేస్తారు!”.. నెట్టింట రచ్చ రేపుతున్న పోసాని సెటైర్లు!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×