E-Paper
Advertisement

“ఇప్పుడే బయటకొచ్చా.. మళ్లీ అరెస్ట్ చేస్తారు!”.. నెట్టింట రచ్చ రేపుతున్న పోసాని సెటైర్లు!

“ఇప్పుడే బయటకొచ్చా.. మళ్లీ అరెస్ట్ చేస్తారు!”.. నెట్టింట రచ్చ రేపుతున్న పోసాని సెటైర్లు!
Advertisement

Posani Comment:పోసాని కృష్ణ మురళి.. పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లకు కథలు ,మాటలు అందించి సొలో రైటర్ గా చక్రం తిప్పిన ఈ సీనియర్ రైటర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి.

ఈ సినిమా జూలై 17న థియేటర్లోకి రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్  నిర్వహించింది మూవీ టీం. అయితే తాజాగా ఈ ప్రమోషన్ ఈవెంట్లో యాంకర్ అడిగిన ఒక క్వశ్చన్ కి పోసాని ఇచ్చిన  కౌంటర్ నెటిజన్స్ కి మాంచి స్టఫ్ లా మారిపోయింది.

Advertisement

మళ్లీ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడే కదా బయటకొచ్చా

యాంకర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో చీరలు కట్టుకోవడానికి అమ్మాయిలే  ఇబ్బంది పడుతుంటే మీరు మాత్రం చీరలు కట్టి డాన్స్ ఎలా చేస్తున్నారు అంటూ క్వశ్చన్ వేసింది .దానికి కౌంటర్ గా పోసాని మాట్లాడుతూ “నేను ఆడవాళ్ల చీర గురించి, నా చీర గురించి మాట్లాడాననుకో.. మళ్లీ అరెస్ట్ చేస్తారు, ఇప్పుడే కదా బయటకొచ్చా!” అంటూ చెప్పడంతో అక్కడున్నవారు గొల్లున నవ్వేశారు .

Advertisement

also read :ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అంచనాలు పెంచేసిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’

ఆమాత్రం దానికి నిజంగానే అరెస్టు చేసేస్తారా

గతంలో వైసిపి హయాంలో పోసాని పవన్ పై ఎలా రెచ్చిపోయాడో , ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక  ఎలా జైళ్ళ చుట్టూ తిరిగాడో  అందరికీ తెలిసిందే .ఇక ఇపుడు దాన్ని దృష్టిలో పెట్టుకొనే  పోసాని ఇలా సెటైర్ వేశాడు అని  కొంతమంది అంటే ఇది సెటైర్ కాదు ఇప్పుడున్న వ్యవస్థలపై టార్గెట్ అంటూ మరికొంతమంది ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు వదులుతున్నారు.ఇక మరికొందరైతే ఆమాత్రం దానికి నిజంగానే అరెస్టు చేసేస్తారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

ఏదేమైనా ఈ సినిమాలో హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్‌ల నటన ఎలా ఉంటుందో కానీ సినిమా విడుదలకు ముందే పోసాని వేసిన ఈ చీర కామెంట్స్  మాత్రం సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిందని చెప్పాలి .ఏదేమైనా చీర కట్టిన పాత్ర గురించి మొదలైన ఈ చర్చ చివరికి పోసాని మాట్లాడితే జైల్లో పెడతారా అనే పొలిటికల్ డిబేట్ కి దారి తీసింది .

also read :ఆమిర్ ఖాన్ రెండో వెడ్డింగ్‌పై రూ.5 కోట్ల సుపారీ.. బాలీవుడ్‌లో ముసలం పుట్టించిన అంతర్మత వివాహం!

చూడాలి మరి పోసాని  చేసిన ఈ  కామెంట్స్  ఆపరేషన్ అరుణ రెడ్డి సినిమా ఓపెనింగ్స్ కి ఏ మాత్రం ప్లస్ అవుతుందో!

Related News

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

ఆ క్షణం కోసం పరితపించాను – సమంత

సుప్రీంకోర్టుకు చేరిన బండ్ల గణేశ్ ఆస్తుల వివాదం.. వచ్చే సోమవారం ఏం జరగనుందో ?

సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అంచనాలు పెంచేసిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’

ఆమిర్ ఖాన్ రెండో వెడ్డింగ్‌పై రూ.5 కోట్ల సుపారీ.. బాలీవుడ్‌లో ముసలం పుట్టించిన అంతర్మత వివాహం!

తెరవెనుక హాలీవుడ్: మనకు తెలియని చిత్ర విచిత్రాలు!

Big Stories

Advertisement
×