E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై కేస్ ఫైల్.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై  కేస్ ఫైల్.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ!
Advertisement

Allu Arjun: పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సమయంలో హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు 70mm సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటన తాలూకు కేసు ఇప్పటికీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో తాజాగా పోలీసులు చార్జీ షీట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు అని చెప్పుకునే కొంతమంది ఎక్స్ ఖాతాలో Space Group Chat ను నిర్వహించారు. అయితే ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది సైబరాబాద్ పోలీసులకు వ్రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఫిర్యాదులో ఏముందంటే?

ఇకపోతే ఫిర్యాదుదారుడు చేసిన ఫిర్యాదు మేరకు.. “కొంతమంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరిస్తున్నారు. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 2025 డిసెంబర్ 27 సాయంత్రం ఏడు గంటల సమయంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినా ఎక్స్ లో స్పేస్ ని ఏర్పాటు చేసి ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ గారి అభిమానులమని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత మాటలు మాట్లాడుతూ.. దుర్భాషలాడుతూ.. వారిని బెదిరిస్తూ. వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించలేదు. దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పలు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ సదరు ఎక్స్ పేజ్ లను కూడా ఈ ఫిర్యాదులో జత చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ అభిమానులపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

A11గా అల్లు అర్జున్..

Advertisement

పుష్ప 2 : ది రూల్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె తనయుడు ఇప్పటికీ మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా అందులో A1 గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చగా, A11 గా అల్లు అర్జున్ ని చేర్చుతూ ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితోపాటు మొత్తం 23 మందిపై ఈ ఛార్జీ షీట్ ఫైల్ చేశారు. తాజాగా సమర్పించిన ఈ చార్జీషీట్ కారణంగానే ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కొంత మంది చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు వారిపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం

ALSO READ:Dhurandhar Collections : ధురంధర్ దూకుడు… 1000 కోట్లు దాటినా తగ్గలేదు!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×