Bison: పెరియారుమ్ పెరుమాళ్ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారి సెల్వరాజ్. ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. సినిమా చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ పోస్టులు కూడా పెట్టారు.
వెంటనే స్టార్ హీరో ధనుష్ దర్శకుడుగా మారి కు అవకాశం ఇచ్చాడు. ధనుష్ హీరోగా వచ్చిన కర్ణం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాకి కూడా విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇప్పటివరకు మారి మొత్తం ఐదు సినిమాలు చేశాడు. ఐదు సినిమాలు కూడా మంచి రిజల్ట్ అందుకున్నాయి.
ఇక రీసెంట్ గా ధ్రువ విక్రమ్ హీరోగా బైసన్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఫలితం అందుకుంది బైసన్ సినిమా.
తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, విక్రమ్ అబ్బాయి ధృవ్ విక్రమ్ నటించిన బైసన్ చిత్రం చూశారు. హీరో ను, అలానే దర్శకుడు మారి సెల్వరాజ్ లను అభినందించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చిత్ర యూనిట్ ను ప్రశంసలు తెలియజేశారు.
ఉదయనిది స్టాలిన్, సంతానం కీలక పాత్రల్లో గతంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మామన్నన్ అనే సినిమాను కూడా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ పరిచయం కూడా ఉండబట్టే ఈ సినిమాను కూడా ఇద్దరూ చూసుంటారు. అలానే కోలీవుడ్ వర్గాల్లో ఆ సినిమాకు భారీ ప్రశంసలు కూడా వస్తున్నాయి.
ఇప్పటివరకు మారి చేసిన ప్రతి సినిమా కూడా మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ప్రతి సినిమాలో కూడా కామన్ గా ఉండే ఒక పాయింట్ అణగారిన కులం మరియు ఆధిపత్య కులం. ఈ కాన్సెప్టును అంతర్లీనంగా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు మారి.
అయితే అదే టైప్ సినిమాలు చేస్తాడు అని కామెంట్స్ వచ్చినందుకు కూడా రియాక్ట్ అయిపోయారు. ఆల్రెడీ సంవత్సరానికి 300 సినిమాలు వస్తాయి అవన్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. నేను ఇలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నాను నన్ను నాలా ఉండనివ్వండి అని కూడా మారి తెలిపాడు.
Also Read: Director Karuna Kumar : ప్రమోషన్స్ అంటే హీరోలు ఫోన్లు ఎత్తరు… ఇండస్ట్రీని హీటెక్కించే కామెంట్ ఇది