Mani Ratnam To Mari : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు. కేవలం తమిళ ప్రేక్షకులలో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులలో కూడా మణిరత్నం కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. చాలామంది దర్శకులకు కూడా మణిరత్నం ఇన్స్పిరేషన్. మణిరత్నం లవ్ స్టోరీలు తీసే విధానం విపరీతంగా చాలామందిని ఆకట్టుకుంటుంది. అందుకే మణిరత్నం ను చాలామంది లవ్ గురు అంటారు. చాలా సినిమాలు మణిరత్నం చేసినా కూడా అతని లవ్ సినిమాలకు మాత్రమే ఎక్కువ పేరు సంపాదించారు.
అయితే చాలామంది సినిమా ప్రముఖులు ఒక సూపర్ హిట్ సినిమా గురించి ప్రశంసలు అందించడం అనేది మామూలు విషయం. అయితే కొంతమంది కొన్ని సినిమాలు చూసినా కూడా వాటి గురించి చెప్పడానికి ఇష్టపడరు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా వినిపించే సినిమా పేరు బైసన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమాపై మంచి ప్రశంసలు వస్తున్నాయి మణిరత్నం కూడా ఆ సినిమాను ప్రశంసించారు.
హాయ్ మారి, ఇప్పుడే సినిమా చూశాను. చాలా నచ్చింది. నువ్వు నిజమైన బైసన్ వి. నీ పనికి గర్వంగా ఉంది. ఇలాగే కొనసాగించు. ఈ గొంతు ముఖ్యం. అంటూ మణిరత్నం తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా దర్శకుడు మారి సెల్వరాజ్ షేర్ చేశారు.
మారి సెల్వరాజ్ స్పందిస్తూ… పరియేరుంపెరుమాళ్ నుండి నేను చేసిన అన్ని సినిమాలను చూస్తూ, అభినందిస్తూ, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞత మరియు ప్రేమ ఎల్లప్పుడూ ఉంటాయి. అని రియాక్ట్ అయ్యారు.
Hi Mari,
Just saw the film. Liked it a lot. You are the Bison. Proud of your work. Keep it going. This voice is important.🦬
– Director Mani Ratnam
பரியேறும்பெருமாளிலிருந்து என் படைப்புகள் அத்தனையையும்… pic.twitter.com/JlHXUaLD3Q— Mari Selvaraj (@mari_selvaraj) October 28, 2025
అయితే దీపావళి కానుకగా మొత్తం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో బైసన్ సినిమాని వారం రోజులు లేటుగా రిలీజ్ చేశారు. వారం రోజులు లేటుగా రిలీజ్ చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా పైన మంచి ప్రశంసలు కురిపించారు.
సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ధృవ విక్రమ్ పర్ఫామెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం తను కష్టపడిన విధానం చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.
Also Read: Mass Jathara Event: స్టేజ్ పైన ఇడియట్ సాంగ్ రీ క్రియేట్ చేసిన రవితేజ, శ్రీ లీల