Mass Jathara Event: రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మాస్ జాతర. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రవితేజ నుంచి ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను అభిమానులు కోరుకుంటారో వాటన్నిటిని డిజైన్ చేశాడు దర్శకుడు భాను. రచయితగా మంచి పేరు సంపాదించుకున్న భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడుగా మారుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఆల్బమ్ విపరీతంగా హిట్ అయిపోయింది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్న తరుణంలో నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ టైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.
రవితేజ మరియు శ్రీ లీల ఇదివరకే కలిసిన నటించిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక వీరిద్దరూ మల్లి మాస్ జాతర సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతుంది.
అయితే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. చక్రి వాయిస్ తో ఒక పాటను కూడా రీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీ లీల మరియు రవితేజ కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా ఆడియో ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు సెలబ్రిటీలు అంత త్వరగా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడరు. కానీ పైన ఆల్రెడీ డాన్సర్స్ రిక్వెస్ట్ చేయడంతో చాలా ఇబ్బందిగా శ్రీలీల మరియు రవితేజ ఈ తు మేరా లవర్ ఏ పాటకు స్టేజ్ ఎక్కి డాన్స్ చేశారు. ఒక్కసారిగా వీరిద్దరూ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడంతో ఎనర్జీ డబుల్ అయింది. ఫాన్స్ లో జోష్ వచ్చింది.
Also Read: Bison: బైసన్ సినిమాపై ముఖ్యమంత్రి ప్రశంసలు, తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి