Chiranjeevi Shared Varun Tej Son Photo: మెగా ఇంట వారసుడు వచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు అయ్యారు. నేడు (సెప్టెంబర్ 10) లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ గుడ్ న్యూస్ ప్రకటించారు. మెగా వారసుడిని ఎత్తుకుని ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. లావణ్య–వరుణ్ తేజ్‌లకు కొడుకు పుట్టినట్టు ట్విటర్ వేదికగా వెల్లడించారు. “ఈ ప్రపంచానికి స్వాగతం మై టిటిల్ వన్. కొణిదెల కుటుంబంలో పుట్టిన బేబికి హృదయపూర్వక స్వాగతం. అలాగే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠిలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
అలాగే నాగబాబు, పద్మజలు తాత–నానమ్మలుగా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉంది.. ఆ బిడ్డ అన్ని రకాల ఆనందం, మంచి ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డను ఉండాలని ఆశిస్తున్నాం‘ అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో చిరు మెగా వారసుడిని ఎత్తుకుని ఎంతో మురుసిపోతున్నాడు. కాగా కొణిదెల ఫ్యామిలీలో తొలి మగబిడ్డ రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక మనవడిని చూస్తూ చిరు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయారు. ఈ ఫోటోలో చిరు బాబుని ఎత్తుకుని ఉండగా.. పక్కనే వరుణ్ తేజ్ ఆనందంతో కొడుకును చూస్తు మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
Welcome to the world, little one!
A hearty welcome to the newborn baby boy in the Konidela family.Heartfelt congratulations to Varun Tej and Lavanya Tripathi on becoming proud parents.
So happy for Nagababu and Padmaja, who are now promoted to proud grandparents.Wishing the… pic.twitter.com/TbBdZ37pRN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 10, 2025
అలాగే వరుణ్ తేజ్ కూడా తను తండ్రి అయినట్టు ప్రకటించాడు. కాసేపటి క్రితమే.. హాస్పిటల్లో లావణ్య త్రిపాఠి కొడుకుని ఎత్తుకుని ఉన్న ఫోటో షేర్ చేశాడు. అవర్ లిటిల్ మ్యాన్ అంటూ బర్త్డే డేట్ ని ప్రకటించాడు. సెప్టెంబర్ 10, 2025న తమ జీవితంలోకి వారసుడు వచ్చాడంటూ శుభవార్తను ప్రకటించాడు. ఈ ఫోటోలో లావణ్య కొడుకుని ఎత్తుకుని ఉండగా.. వరుణ్ ఆమె తలను ముద్దాడుతూ కనిపించాడు. ఇక వరుణ్ తేజ్ పోస్ట్‌కి ఉపాసన స్పందించింది. కంగ్రాట్చ్యూలేషన్స్.. సో హ్యాపీ అంటూ కామెంట్ చేసింది. అలాగే మినాక్షి చౌదరి, శ్రియ శరణ్, డింపుల్ హయాతి వంటి సినీ ప్రముఖులు వారికి అభినందలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ మెగా కపుల్ అభినందలు వెల్లువెత్తున్నాయి.
కాగా వరుణ్ తేజ్- లావణ్యలు ఆరేళ్ల డేటింగ్ అనంతరం నవంబర్ 1, 2023లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మిస్టర్, అంత్యాక్షరి వంటి చిత్రాల్లో వీరిద్దరు జంటగా నటించారు. అదే టైంలో ప్రేమలో పడ్డ వరుణ్, లావణ్య కొంతకాలం సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారు. ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. పెద్దల అంగీకారంతో 2023లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఇక పెళ్లయిన రెండేళ్లకు ఈ జంట నుంచి శుభవార్త చెప్పింది. బుధవారం మెగా కపుల్కి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కొణిదెల ఇంట్లో వారసుడి రాక కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు రాకతో మెగా ఫ్యామిలీ వేడుక చేసుకుంటోంది.