Nani: వెన్నెల సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు దేవకట్ట. ఆ సినిమా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ సక్సెస్ కాలేదు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక దర్శకుడు వచ్చాడు అని అనిపించుకున్నాడు దేవకట్ట. అయితే దేవకట్ట తీసిన ప్రస్థానం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాకి కూడా కమర్షియల్ సక్సెస్ రాలేదు. కానీ విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరిలో కంటే కూడా దేవకట్ట కొంతమేరకు ప్రత్యేకమని చెప్పాలి. తన సినిమాల ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తుంటాడు. దేవకట్ట రైటింగ్ చూసి ఇండస్ట్రీలో ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. అందుకే తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి వంటి సినిమాకి కూడా రాయడానికి రాజమౌళి దేవకట్ట సహాయని తీసుకున్నారు. వార్ సీన్ లో వచ్చే డైలాగ్స్ అన్నీ కూడా బాహుబలి సినిమాలో దేవకట్ట రాసినవే.
అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టిన నాని అష్టాచమ్మా సినిమాతో నటుడుగా మారిపోయాడు. ఆ తరువాత మంచి సినిమాలు చేయటంతో హీరోగా సెటిల్ అయిపోయాడు. నాని కెరియర్ లో కూడా కొన్ని ప్లాప్ సినిమాలు ఉన్నాయి. అయితే జెర్సీ సినిమా తర్వాత నాని సినిమా కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది. కొత్త దర్శకులను కూడా పరిచయం చేయడం మొదలుపెడుతున్నాడు.
ఇక ప్రస్తుతం నాని దేవకట్ట దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అయితే నాని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేసి చాలా రోజులైంది. ఇప్పుడు దేవకట్ట తో చేస్తే ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని పారడైజ్ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సుజిత్ తో సినిమా ఉండబోతుంది అని ఆల్రెడీ ప్రకటించారు.
మరి ఇప్పుడు దేవకట్టతో సినిమా అంటే సుధీత్ సినిమా పక్కకు వెళ్తుందా అని ఆలోచన చాలామందికి మొదలైంది. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుజీత్ సినిమా అయిపోయిన తర్వాతే దేవకట్టతో సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈసారి దేవకట్ట ఎలాంటి స్క్రిప్టును నాని కోసం సిద్ధం చేశాడో చూడాలి.
Also Read: The Raja Saab: రాజా సాబ్ సెకండ్ ప్రయత్నం.. నష్ట నివారణ చర్యలా?