Nara Rohit -Siri Lella: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు అభిమానులకు శుభవార్తలు తెలియజేస్తున్నారు. కొంతమంది హీరో హీరోయిన్లు తల్లితండ్రులుగా ప్రమోట్ అవ్వగా మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నారా రోహిత్(Nara Rohit) సిరి లెల్లా(Siri Lella) జంట ఒకటి . వీరిద్దరూ ప్రతినిధి 2 సినిమా ద్వారా జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ జంట అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఐదు రోజులపాటు రోహిత్, సిరి వివాహపు వేడుకలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే నేడు హల్దీ వేడుక (Haldi Ceremony)ఎంతో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ హల్దీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ హల్ది వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఈ వేడుకను నిర్వహించారని తెలుస్తుంది. ఇక ఈ హల్దీ కార్యక్రమం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగానే జరిగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక నారా రోహిత్ నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే . కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇన్ని రోజులు పాటు పెళ్లి గురించి ఆలోచించని నారా రోహిత్ ఇటీవల హీరోయిన్ తో ప్రేమలో పడటంతో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నిచ్చితార్థం గత ఏడాది నవంబర్ లో ఎంతో ఘనంగా జరిగింది అయితే ఇప్పటికే వీరి వివాహం జరగాల్సి ఉండగా, నారా రోహిత్ తండ్రి మరణించడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
హాజరుకానున్న సినీ రాజకీయ ప్రముఖులు..
ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. రోహిత్ పెదనాన్న స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా నారా రోహిత్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక నారా రోహిత్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈయన భైరవం, సుందరకాండ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇటీవల కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈయన వ్యక్తిగతంగా కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mass Jathara: బాహుబలి ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన మాస్ జాతర.. నిజమెంత?