Actress Death:సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చాలామంది ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అయితే వీళ్లంతా కొందరు చిన్న వయసులోనే మరణిస్తే.. మరికొంతమంది 90 ఏళ్ల లోపు వాళ్లు వృద్ధాప్య కారణాలతో మరణించారు. కానీ ఇక్కడ ఒక నటి ఏకంగా సెంచరీ కొట్టేసింది.. 100 సంవత్సరాల వయసులో ఆమె సంపూర్ణ జీవితాన్ని అనుభవించి.. నేడు కన్ను మూసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు సంపూర్ణ జీవితం అనుభవించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆమె ఎవరు? ఆమె మరణానికి గల కారణం ఏమిటి? వృద్ధాప్య సమస్యలే ప్రధాన కారణమా? అనే కోణంలో కూడా నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఆమె ఎవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ అమెరికన్ నటి జూన్ లాకోర్ట్ (June Lockhart) వంద సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కాలిఫోర్నియాలోనే తన నివాసంలో తుది శ్వాస విడిచారు.. 1925లో జన్మించిన ఈమె.. ఎనిమిదేళ్ల వయసులోనే నటనను ప్రారంభించి సుమారుగా 90ఏళ్ల పాటు సినీ రంగంలోనే కొనసాగారు. లాస్సీ, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి టీవీ సీరియల్స్ లో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఏదేమైనా 20 కాదు.. 30 కాదు.. 50 కాదు ఏకంగా 90 సంవత్సరాలు సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న నటి ఇప్పుడు స్వర్గస్తులవడంతో కొంతమంది విచారణ వ్యక్తం చేసినా.. మరికొంతమంది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.. ఇన్ని సంవత్సరాలు కష్టపడింది చాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ లాకోర్ట్ మరణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Bigg Boss 9 Promo: పోతూ పోతూ హౌస్ లో పెంట పెట్టిన పచ్చళ్ల పాప..పాపం బలైన మాధురి!