BigTV English
Advertisement

Rashmika Manadanna : ‘గర్ల్ ఫ్రెండ్ ‘ కోసం నిద్రలేని రాత్రులు.. డ్రెస్సింగ్ రూమ్ లోనే ఆ పని..!

Rashmika Manadanna : ‘గర్ల్ ఫ్రెండ్ ‘ కోసం నిద్రలేని రాత్రులు.. డ్రెస్సింగ్ రూమ్ లోనే ఆ పని..!

Rashmika Manadanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఏడాది పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది. తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. లేడీ ఒరియేంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ లో నటిస్తుంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను రష్మిక పంచుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..


‘గర్ల్ ఫ్రెండ్’ కోసం నిద్రలేని రాత్రులు..

రష్మిక మందన్న ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అందుకు కారణం సినిమాలపై ఆమెకున్న ఫ్యాషన్, సినిమా కోసం ఆమె పడే కష్టం. ఈ మాటని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అంటున్నారు. తాజాగా గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్మిక మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఈ మూవీ నాకు కొత్తగా అనిపిస్తుంది. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. నిద్రలేని ఎన్నో రాత్రులను గడిపాను. డ్రెస్సింగ్ రూమ్ లోనే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కి రెడీ అయ్యి వచ్చేదాన్ని అంటూ ఆమె అన్నారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన రష్మిక అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Also Read : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..


ఆకట్టుకుంటున్న ‘గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్.. 

ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. రష్మిక మందన్న, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.. రిలీజ్ అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మనం చిన్న బ్రేక్ తీసుకుందామా.. అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. మిగతా అంతా చాలా ఎమోషనల్ కంటెంట్ తో సాగింది.. మొత్తానికి ఎమోషనల్ స్టోరీ గా ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. ఇందులో రష్మిక మందన్న నటన కొత్తగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ చూడని రష్మికను ఈ మూవీలో చూడవచ్చు. రాజశేఖర్ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది కూడా.. మరి మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

Actress Death: 90 ఏళ్ల సినీ అనుభవం..ప్రముఖ నటి కన్నుమూత!

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ – మహేష్ కాంబోలో మూవీ.. మెంటలెక్కించే ట్విస్ట్..

Dude Director: నేను ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆర్య 2 చూసి ఉంటే అది జరిగేది

Mari Selvaraj: నేను అలాంటి సినిమాలే తీస్తాను దయచేసి నన్ను వదిలేయండి

Nara Rohit -Siri Lella: ఘనంగా నారా రోహిత్ సిరి లెల్లా హాల్దీ..ఫోటోలు వైరల్!

Nani: దేవకట్ట దర్శకత్వంలో నాని, మరి సుజీత్ సినిమా పరిస్థితి ఏంటి?

The Raja Saab: రాజా సాబ్ సెకండ్ ప్రయత్నం.. నష్ట నివారణ చర్యలా?

Big Stories

×