IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా నిన్నటితో మూడు వన్డేల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 29వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. అంటే మరో మూడు రోజుల్లోనే టోర్నమెంట్ కు రంగం సిద్ధమవుతుందన్నమాట. ఇక వన్డే సిరీస్ ఓడిపోయిన టీమ్ ఇండియా, ఎలాగైనా టి20 సిరీస్ గెలవాలని ప్లాన్ చేస్తోంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st T20I) మధ్య టి20 సిరీస్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 29వ తేదీన కాన్ బెర్రా వేదికగా మొదటి టి20 జరగనుంది. అయితే ఈ టి 20 సిరీస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే టాస్ ప్రక్రియ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియా టైమింగ్ ప్రకారం అక్కడ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
అక్టోబర్ 31వ తేదీన రెండవ వన్డే మెల్ బోర్న్ వేదికగా నిర్వహించనున్నారు. నవంబర్ రెండో తేదీన హోబర్ట్ వేదికగా మూడవ టి20, నవంబర్ ఆరవ తేదీన గోల్డ్ కోస్ట్ వేదికగా నాలుగో టి20 జరగనుంది. నవంబర్ 8వ తేదీన బ్రిస్ వేదికగా చిట్టచివరి టీ20 జరుగుతుంది. ఎప్పటిలాగే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ కూడా జియో హాట్ స్టార్ యాప్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు సామ్సన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (గేమ్స్ 1–3), జేవియర్ బార్ట్‌లెట్, మహలి బియర్డ్‌మాన్ (గేమ్స్ 3–5), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (గేమ్స్ 4–5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (గేమ్స్ 1–2), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ (గేమ్స్ 3–5), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా