BigTV English
Advertisement

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ – మహేష్ కాంబోలో మూవీ.. మెంటలెక్కించే ట్విస్ట్..

Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ – మహేష్ కాంబోలో మూవీ.. మెంటలెక్కించే ట్విస్ట్..

Pradeep Ranganathan : కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రదీప్ రంగనాథన్.. డైరెక్టర్ గా పలు సినిమాలను తెరకెక్కించిన ఈయన హీరోగా సక్సెస్ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్గా డ్యూడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ 100 కోట్లకు పైగా వసూల్ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా గతంలో ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోలు అనుకున్నారు. అయితే డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్, మహేష్ బాబు సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల మూవీ మిస్ అయ్యిందని టాక్.. ఎందుకు ఈ కాంబోలో మూవీ ఆగిపోయిందో చూడాలి..


ప్రదీప్ – మహేష్ కాంబోలో మూవీ..? 

హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒకప్పుడు డైరెక్టర్ గా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. అయితే డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు కాంబోలో మూవీ రాబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఆ మూవీ మిస్ అయ్యింది. అందుకు కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు. వీరిద్దరి కాంబోలో కోమలి చిత్రం రావాల్సి ఉంది. మహేష్ బాబును కలిసి స్టోరీని కూడా వినిపించాలని అనుకున్నాడట.. కానీ ఆ ఛాన్స్ రాకపోవడంతో ఆ సినిమా మిస్ అయింది అని ఇండస్ట్రీలో టాక్. ఆ తర్వాత ఈ మూవీ ని జయం రవి చేశాడు. అది హిట్ అవ్వడం, ఆ తర్వాత ప్రదీప్ ప్రయాణం ఇలా సాగుతూ ముందుకెళ్లడం జరిగింది. అప్పుడు మిస్ అయిన ఈ కాంబో ఇప్పుడు ఫిక్స్ అవుతుందేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ మధ్య ప్రదీప్ రంగనాథన్ గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది.. అయితే ఆయన డైరెక్టర్ గా కాకుండా హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి కనుపరుస్తున్నారని తెలుస్తుంది. మరి మహేష్ బాబు తో సినిమా అంటే కష్టమే.

ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన సినిమాలు.. 

ఈయన కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు.. స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేశారు.. ప్రదీప్ దర్శకత్వం, రచయితగా చేసిన సినిమాల విషయానికొస్తే.. ఎల్ కె జీ, కోమలి, లవ్ టుడే, లవ్ యాపా.. లవ్ టుడే చిత్రంతో దర్శకుడుగా మాత్రమే కాదు హీరోగా కూడా పరిచయమయ్యాడు. ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత డ్రాగన్ మూవీలో నటించాడు. డైరెక్టర్ గా మాత్రమే కాదు హీరోగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన డ్యూడ్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 100 కోట్లకు మించి కలెక్షన్లను వసూలు చేసింది.. దీపావళి కి రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే విన్నర్..


Also Read : ‘గర్ల్ ఫ్రెండ్ ‘ కోసం నిద్రలేని రాత్రులు.. డ్రెస్సింగ్ రూమ్ లోనే ఆ పని..!

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ వస్తున్నాడు. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా యావరేజ్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు 29వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Related News

Film Chamber: 30 ఏళ్ల ఫిలిం ఛాంబర్ కూల్చివేత.. అసలేం జరుగుతోంది?

Actress Death: 90 ఏళ్ల సినీ అనుభవం..ప్రముఖ నటి కన్నుమూత!

Rashmika Manadanna : ‘గర్ల్ ఫ్రెండ్ ‘ కోసం నిద్రలేని రాత్రులు.. డ్రెస్సింగ్ రూమ్ లోనే ఆ పని..!

Dude Director: నేను ఆర్య సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఆర్య 2 చూసి ఉంటే అది జరిగేది

Mari Selvaraj: నేను అలాంటి సినిమాలే తీస్తాను దయచేసి నన్ను వదిలేయండి

Nara Rohit -Siri Lella: ఘనంగా నారా రోహిత్ సిరి లెల్లా హాల్దీ..ఫోటోలు వైరల్!

Nani: దేవకట్ట దర్శకత్వంలో నాని, మరి సుజీత్ సినిమా పరిస్థితి ఏంటి?

Big Stories

×