Cm Revanth Reddy On Ram Charan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్లో రామ్ చరణ్ తేజ్ ఒకరు. చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. మొదటి సినిమాతోనే చిరంజీవికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రెండవ సినిమాతోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా మగధీర సినిమా చూస్తే చరణ్ ఇంత బాగా ఎలా చేశాడు అని అనిపిస్తుంది. చరణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా మగధీర సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత చరణ్ చేసిన సినిమాలేవి కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేదు.
చరణ్ మీద విమర్శలు
ప్రతి హీరో మీద కూడా కొన్ని విమర్శలు జరుగుతూ ఉంటాయి. అలానే ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాలు అన్నిటి పైన కూడా విమర్శలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ధ్రువ సినిమా తర్వాత చరణ్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. చరణ్ లోని ఇంత గొప్ప నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత చేసిన వినయ విధేయ రామ ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం చరణ్ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
సీఎం మాటల్లో చరణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఆయన చేస్తున్న కృషి గర్వించదగ్గది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అనేది తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఇచ్చిన గౌరవం అని చాలామందికి అనిపించింది. ఆ నిర్ణయం మాత్రం ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఇక పలు కార్యక్రమాల్లో సినిమా వాళ్ళను ఆయన ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇదివరకే సినిమా టికెట్ రేట్లు హైక్ కోసం వస్తే సందేశం ఇచ్చేలా వీడియో బైట్ చేయాలి అంటూ అప్పట్లో ఒక రూల్ పెట్టారు. ఇక తాజాగా ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయ్ దేవరకొండ మరియు రామ్ చరణ్ ను ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ గురించి మాట్లాడారు. నాకు రామ్ చరణ్ స్కూల్‌కి వెళ్లే రోజుల నుండి తెలుసు.. రామ్ చరణ్ ఒకరోజు గొప్పవాడు అవుతాడని అనుకున్నాను. నా కళ్ల ముందే స్కూల్ నుండి రియల్ స్టార్‌గా ఫిలిం ఇండస్ట్రీలో రాణించాడు.. RRR సినిమా ద్వారా ఆస్కార్ సాధించి, దేశానికి గౌరవాన్ని తెచ్చాడు. అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read : Vijay Devarakonda: నా జీవితంలో డబ్బులు లేని రోజులు చూసా