ICC New Rules : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఐదు కొత్త రూల్స్ ( New Rules) ని తీసుకొచ్చింది. ఇవాళ అనగా జూన్ 26, 2025న ప్రకటించిన ఈ రూల్స్ లో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ పై ఫోకస్ చేస్తూ రూల్స్ ని ప్రకటించింది. గత వారమే ఈ కండిషన్ సబ్ స్టిట్యూట్ లో గందరగోళాన్ని తొలగించా.. వన్డే ఫార్మాట్ లో బ్యాట్, బంతికి మధ్య కాంటెస్ట్ రసవత్తరంగా మార్చాలని.. కొత్త బంతి పై ఆంక్షలు విధించిన విషయం విధితమే. తాజాగా టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్ రూల్.. డీఆర్ఎస్ విధానం పై మార్పులు చేస్తూ కీలక రూల్స్ ప్రకటించింది. ఈ రూల్స్ మూడు ఫార్మాట్ లకు వర్తిస్తాయి. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : IND vs ENG : ఆర్చర్ వస్తున్నాడు.. బూమ్రా పోతున్నాడు.. రెండో టెస్టులో టీమిండియా గెలవడం గగనమే
టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్..
స్టాప్ క్లాక్ రూల్ ఇప్పటివరకు వన్డే, టీ-20 ఫార్మాట్ మ్యాచ్ లకు మాత్రమే ఉంది. అయితే ఈ రూల్ ను ఐసీసీ టెస్టుల్లోనూ చేర్చింది. టెస్ట్ మ్యాచ్ ల్లో స్లో ఓవర్ రేట్ పరిష్కారానికి స్టాప్ క్లాక్ విధానం తీసుకొచ్చారు. ఒక ఓవర్ ముగియగానే 1 నిమిషం లోపు కొత్త ఓవర్ ప్రారంభించాలి. రెండు మెచ్చరికల తరువాత 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ప్రతీ 80 ఓవర్లకు గడియారం రీసెట్ అవుతుంది.
సలైవా (ఉమ్మి రాకి రుద్దడం) బ్యాన్
బంతి పై లాలాజలం వాడకం పై నిషేదం తొలగించిన విషయం తెలిసిందే. అయితే దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఫీల్డింగ్ చేస్తున్న జట్టు.. కొత్త బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అంపైర్ బంతి పై సలైైవా గుర్తించినప్పటికీ బాల్ మార్చడం ఇక కుదరదు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అలా చేసినట్టయితే బ్యాటింగ్ జట్టుకి 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు.
DRS విధానంలో కొత్త మార్పు:
DRS రూల్ ప్రకారం.. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు క్యాచ్ కోసం అప్పీల్ చేస్తుంది. ఇక ఈ సమయంలో అంపైట్ ఔట్ ఇస్తే.. బ్యాటింగ్ చేసే జట్టు క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూ కోరుతుంది. ఈ సమయంలో థర్డ్ అంపైర్ తొలుత ఆల్ట్రాఎడ్జ్ చెక్ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ కి తగలకపోతే LBW కోసం అంపైర్ చెక్ చేస్తారు. LBW లో ఔట్ అని తేలినా.. ఇక అంపైర్ కాల్ వచ్చినా ఔట్ గానే పరిగణిస్తారు.
నో బాల్ లో క్యాచ్ పడితే పరుగులుండవు :
కొత్త రూల్స్ ప్రకారం.. నో బాల్ వేసినప్పుడు క్యాచ్ పడితే దానిని నాటౌట్ గా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. అయితే క్యాచ్ పట్టినప్పుడు అది క్లీన్ క్యాచా.. కాదా..? అని పరిశీలిస్తారు. ఒకవేళ క్లీన్ క్యాచ్ పట్టినట్టయితే అప్పటివరకు తిరిగిన పరుగులు బ్యాటింగ్ జట్టుకు జత చేయరు. కేవలం నో బాల్ పరుగు మాత్రమే బ్యాటింగ్ జట్టు స్కోర్ కి యాడ్ అవుతుంది. క్లీన్ క్యాచ్ కాకపోతే బ్యాటర్లు పూర్తి చేసిన పరుగులను జట్టు స్కోర్ లో జత చేస్తారు.
షార్ట్ రన్స్ తీస్తే పెనాల్టీ..
బ్యాటర్లు పరుగు పూర్తి చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో బ్యాట్ పూర్తిగా క్రీజులో పెట్టక ముందే పరుగెత్తుతుంటారు. అలా చేస్తే షార్ట్ రన్ గా పరిగణిస్తారు. గతంలో ఇలా చేస్తే.. అంపైర్స్ చెక్ చేసి ఆ రన్ ఉ:డదని చెప్పేవారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం.. షార్ట్ రన్స్ తీసినట్టయితే.. ఆ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ విధించనున్నారు. అలాగే ఫీల్డింగ్ జట్టు తరువాత బంతి ఎవ్వరూ స్ట్రైక్ తీసుకోవాలో కూడా ఎంచుకోవచ్చు.