Intinti Ramayanam Today Episode july 10 th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఫుడ్ తినకపోవడంతో బయట ఏదైనా తినాలని అనుకుంటాడు. బయట ఫుడ్డు తిన్న తర్వాత బయటికి వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అవని చూసి అక్షయ్ కు నీళ్లు ఇస్తుంది. ఏమైందండీ ఏం జరిగింది అని అవని టెన్షన్ పడుతూ అడుగుతుంది. నాకేం కాలేదు పర్లేదు నువ్వు వెళ్ళు అని అక్షయ్ అంటాడు. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి నేను ఎలా వెళ్తాను ఏమైంది చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది. ఇక వాంతులు ఎక్కువ అవడంతో అక్షయ్ ని తన బండిపై తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుంది అవని. రాజేంద్రప్రసాద్ అవని వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. పార్వతిని డ్రాప్ చేసి వస్తానని వెళ్ళింది. అక్కడ ఏమైనా గొడవ జరిగిందా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని అనుకుంటాడు. అంతలోకే అవని అక్షయ్ ని బండి మీద ఎక్కించుకొని ఇంటి దగ్గరికి వస్తుంది. అక్షయ్ ను సేఫ్ గా తీసుకొచ్చి ఇంటికి చేరుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ని ఎలాగైనా ఒప్పించాలని భానుమతి ప్రయత్నిస్తుంది కానీ అక్షయ్ ఒప్పుకోడు.. ఇక రాత్రి కమల్ ఇంటికి నేను రాను అని చెప్పాను కదా అని కమలాకర్ వేషంలో వచ్చి చెప్తాడు. నేను నా కొడుకు మనవరాలు దగ్గరే ఉన్నాను నువ్వు కూడా అక్కడికి వచ్చేసేయ్ ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను భానుమతి అని అంటాడు. నీకోసం నేను అక్కడికి వచ్చేస్తాను అని భానుమతి కూడా అంటుంది. ఇక ఉదయం భానుమతి నాకు వయసు అయిపోయింది నడుము నొప్పులు ఎక్కువ సేపు నిలబడుకోలేను ఏది చేయలేను నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను అని అంటుంది. నేను ఈయనకు తోడుగా ఇక్కడే ఉంటాను అంటే ఏం అవసరం లేదు నేను అక్కడికి వస్తానని అక్షయ్ అవనితో అంటాడు. మొత్తానికి అవని వాళ్ళ ఇంటికి వెళ్లడానికి అక్షయ్ ఒప్పుకుంటాడు.
అయితే అక్షయ్ నీరసంగా ఉండడంతో పడిపోతూ ఉంటాడు.. భానుమతి టెన్షన్ పడుతూ అరె పెద్దోడా ఎలా ఉండే వాడివి అలా అయిపోయావురా అని బాధపడుతూ ఉంటుంది.. అవని నా భుజం మీద చెయ్యి వేసుకోండి అని అంటుంది. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని అక్షయ్ అంటాడు. మీరు పడిపోతుంటే నేను ఆపాను తప్ప అడ్వాంటేజ్ తీసుకోలేదు అని అవని అంటుంది. నీకేం కాకూడదని టెన్షన్ పడుతూ తీసుకొస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావా ఇదే నీ ప్రవర్తన.. ఇదే నీ బిహేవియర్ అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
ప్రణతి స్వరాజ్యం దయాకర్ అక్ష ఇంటికి రావడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. చాలా కాలం తర్వాత ఇలా మీ ఇద్దరిని కలిసి రావడం చూసి సంతోషంగా ఉంది అని స్వరాజ్యం అంటుంది.. అదేవిధంగా దయాకర్ కూడా మీరిద్దరు ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటే చూడాలని ఉంది అమ్మా అని అంటాడు. కానీ అక్షయ్ మాత్రం వాళ్ళకి ముందే ఇలా చెప్పాలని చెప్పావా అని అరుస్తాడు. అవని నేనేం వాళ్లకి చెప్పలేదండి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని అంటుంది..
ప్రణతిని రాజేంద్రప్రసాద్ హారతి తీసుకురమ్మని అంటాడు. ప్రణతి వెళ్లి హారతికి అంత సిద్ధం చేస్తుంది. మనమేమీ కొత్తగా పెళ్లి అయిన జంట కాదు కొత్త కాపురానికి వస్తున్నాము కాదు. నరదిష్టి ఏదైనా ఉంటే పోతుందని హారతి తీసుకు రమ్మన్నాను అంతేను అని అంటుంది. ఇక భానుమతి కూడా నరదిష్టి ఎలాంటి మనిషి అయినా కృంగతీస్తుంది తీయనివ్వురా అని అనడంతో అక్షయ్ సైలెంట్ అవుతాడు. ఇంట్లోకి తీసుకెళ్లగానే పిన్ని గారు ఈయన పెయిడ్ గెస్ట్ గా ఇక్కడ ఉంటారు వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు చెల్లిస్తారు అని అంటుంది. వదిన దగ్గరికి రావడం కోసం నువ్వు పేడ్ గెస్ట్ గా ఉండడం ఏంటి అన్నయ్య అని ప్రణతి అంటే అది వాడికి అర్థం కాదులేమని రాజేంద్రప్రసాద్ అంటాడు.
Also Read: రోహిణిని ఇరికించిన బాలు.. తండ్రి కాబోతున్న మనోజ్.. ప్రభావతి ఫుల్ ఖుషి..
అవని అక్షయ్ కు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది.. అయితే కాఫీ కావాలని అడిగితే లేదు మీరు ఈ పాలు తాగండి అంత సెట్ అవుతుందని అంటుంది. అక్షయ్ తన దగ్గర ఉన్న బుక్ లో పాలకు ఎంత ఖర్చు అని లెక్క వేస్తాడు. అది చూసిన రాజేంద్రప్రసాద్ వాడు ఇక్కడి నుంచి వెళ్లేలోగా నీతో కలిసి పోయేలా చేసే బాధ్యత నాది అని అంటాడు. శ్రియ పల్లవిలు భోజనం దగ్గర గొడవ పడడం చూసి పార్వతి వాళ్ళ పై సీరియస్ అవుతుంది. మీ మొగుళ్ళు ఎందుకు తాగొస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఇలా ఉండడం వల్లే కదా వాళ్ళు తాగొస్తున్నారు అని అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కమల్ శ్రీకర్ ను చూసి షాక్ అవుతుంది. ఇలా తాగొస్తే మీ భార్యలు మీకు విలువిస్తారని పార్వతి ఇద్దరినీ చెంప పగలగొడుతుంది. ఎప్పుడు తాగమని వాళ్ళు లోపలికి వెళ్లి పోతారు పల్లవి శ్రియాలకు మాత్రం పార్వతీ క్లాస్ పీకుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవికి అనుమానం వస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..