Comedian Sudhakar: సీనియర్ స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో ఆయన నటించి మెప్పించాడు. తమిళ్ లో అయితే హీరోగా కూడా నటించాడు. ఆయన ఎంట్రీ కూడా ఒక రేంజ్ లోనే జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారో సుధాకర్ కూడా అంతే గ్రాండ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. వారితో సమానంగా కలిసి నటించడమే కాకుండా అంతే గుర్తింపును కూడా అందుకున్నాడు.
గత కొన్నేళ్లుగా సుధాకర్ ఇండస్ట్రీకి దూరంగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ వారి వ్యూస్ కోసం ఆయన మరణించాడని కూడా రాసుకొచ్చాయి. కానీ, తానింకా బ్రతికే ఉన్నాను అని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చి చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య ఆ సుధాకర్ అనారోగ్యం బాగా క్షీణించిందని, నెలరోజులు కోమాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా సుధాకర్ కుటుంబ పరిస్థితి కూడా ఏమి బాలేదని, ఆస్తులన్నీ పోగొట్టుకొని ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారని కూడా పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై సుధాకర్ కొడుకు బెన్నీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధాకర్, బెన్నీ మాట్లాడుతూ.. ” నాన్నగారు నెలరోజులు కోమాలో ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇక మేము ఆర్థికంగా సతమతమవుతున్న విషయం నిజమే కానీ, మరీ అంత హీన స్థితిలో లేమని చెప్పుకొచ్చాడు.
ఇక సుధాకర్ కూడా అదే విషయాన్నీ తెలిపాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను అని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సుధాకర్ గురించి వచ్చిన ఏ వార్తలో నిజం లేదని క్లారిటీ వచ్చింది. ఈ వార్త. విన్న ఆయన అభిమానులు సుధాకర్ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే సుధాకర్ కొడుకు బెన్నీ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తండ్రి పోలికలను పుణికిపుచ్చుకున్న బెన్నీ ఇండస్ట్రీలో తండ్రి అంత స్థాయికి చేరుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.