Film industry:సినీ ఇండస్ట్రీలో తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఒక హీరోయిన్ ని పోలీసులు అరెస్టు చేశారు. అందులోనూ కిడ్నాప్ కేసులో అరెస్టు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో నటి లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆదివారం రాత్రి రెస్టారెంట్ లో జరిగిన వాగ్వాదం తర్వాత లక్ష్మీ గ్యాంగ్ బాధితుడిని వెంబడించి.. కారులోకి లాక్కొని దాడి చేశారని ఫిర్యాదు అందింది. ప్రస్తుతం మిథున్, అనీష్, సోనామోల్ అరెస్టు కాగా.. ప్రస్తుతం లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నట్లు తెలిపారు. రెస్టారెంట్ బార్ వద్ద లక్ష్మీ మీనన్ గ్యాంగ్ కి, బాధితుడి స్నేహితుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు, బాధితుడిని వెంబడించి అతడి కారును అడ్డగించారు. ఆ తర్వాత బలవంతంగా తమ కారులోకి లాక్కొని దాడికి పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నారు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు అంటూ బాధితుడు పోలీసులకు వివరించారట. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం నటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
లక్ష్మీ మీనన్ నటించిన చిత్రాలు..
ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఎక్కువగా ఈమె తెలుగు చిత్రాలలో నటించింది. సుందర పాండియన్, జిగర్తాండ, వేదాళం, చంద్రముఖి 2 వంటి తదితర చిత్రాలలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె విశాల్ నటించిన ఇంద్రుడు సినిమాతో మరో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
లక్ష్మీ మీనన్ కెరియర్..
మే 19 న జన్మించిన ఈమె 2013లో వచ్చిన నా బంగారు తల్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం తోపాటు మలయాళంలో కూడా ఎంతే అనే సినిమా ద్వారా అంతే గుర్తింపును సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో మూడు అవార్డులు గెలుచుకున్న ఈమె.. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రశంసలు అందుకుంది. అటు నటిగా , ఇటు గాయనిగా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె అటు అవార్డులు, నామినేషన్లు కూడా దక్కించుకుంది.
ALSO READ:Vijay Thalapathi: అభిమానిపై దాడి.. హీరో విజయ్ పై కేసు నమోదు