Coolie film: గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు ప్రజలను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా నదులు, డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి తట్టుకోలేక చాలా ప్రదేశాలలో డ్యామ్ ల గేట్లు ఎత్తివేస్తూ నీటిని పక్కకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ నీటి వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. రోడ్లపైకి జనావాసాలలోకి ఈ నీరు అధికంగా వచ్చి చేరడం వల్ల జీవనానికి కష్టంగా మారిపోయింది. చాలామంది ఇళ్లల్లోకి వరద నీళ్లు చొరబడి ఇబ్బందులు కలిగిస్తుంటే.. ఇప్పుడు ఈ నీటి వల్ల సినిమాలకు కూడా కష్టం ఏర్పడిందని చెప్పవచ్చు.
కాసేపట్లో మార్నింగ్ షో.. వరద నీటితో నిండిపోయిన థియేటర్లు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో.. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా చేసిన చిత్రం కూలీ. ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా వీకెండ్స్ కావడంతో ప్రస్తుతం చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కాసేపట్లో కూలీ మార్నింగ్ షో మొదలవుతుంది అనుకునే లోపే థియేటర్ మొత్తాన్ని వరద నీరు ముంచేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లో చూడాలని కోటి ఆశలతో వచ్చిన ప్రేక్షకులకు ఇది తీరని నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. మరి ఆ థియేటర్ ఎక్కడ ఉంది? వరద నీరు ముంచెత్తడానికి కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
కూలీ , వార్ 2 మూవీ షోలు నిలిపివేత..
అసలు విషయంలోకి వెళ్తే.. భారీ వర్షాలు కూలీ సినిమాపై ఇప్పుడు ఊహించని ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చెప్పవచ్చు. అదిలాబాదు జిల్లాలో కూలీ , వార్ 2 మూవీలు ప్రదర్శితమవుతున్న థియేటర్ లు వరద నీటితో నిండిపోయింది. జిల్లా కేంద్రంలో ఉన్న నటరాజ థియేటర్లోకి వరద నీరు చేరడంతో కూలీ, వార్ 2 మూవీ షో లను రద్దు చేశారు. ఇకపోతే సినిమా చూడడానికి థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఇక ఇదే విషయంపై వారు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ.. సినిమా చూడడానికి మార్నింగ్ షో కి వచ్చాము. కానీ థియేటర్ లోపల కూడా వరద నీరు ముంచెత్తింది. ఫలితంగా షోని ఆపివేశారు అంటూ సదరు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరద నీరు ముంచెత్తడానికి కారణం..?
ఇకపోతే ఉన్నట్టుండి ఈ వరద నీరు పోటెత్తడానికి అసలు కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట అధిక వర్షాల కారణంగా నీరు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలోనే 18 గేట్లకు గానూ ఇప్పటికే 17 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు నిర్వాహకులు. అధిక వరద నీటి కారణంగా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడిపోయింది. గత ఏడాది కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో డ్యామ్ తెగిపోతుందేమో అని ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతికారు. అయితే ఇప్పుడు అధికారులు మరమ్మత్తులు చేసి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో రోడ్లపై నుంచి వరద నీరు ఉదృతంగా పారుతుంది. ఇక దీంతో థియేటర్లలోకి కూడా నీరు వచ్చి చేరాయి. అందులో భాగంగానే కూలీ, వార్ 2 షోలను రద్దు చేస్తున్నట్లు థియేటర్ నిర్వాహకులు ప్రకటించాయి.
భారీ వర్షాలు కూలీ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి కూలీ మూవీ ఉన్న థియేటర్ వరదతో నిండిపోయింది. జిల్లా కేంద్రంలో ఉన్న నటరాజ్ థియేటర్లోకి వరద నీరు చేరడం, కూలీ మూవీ షోలను రద్దు చేశారు.#adilabad #theatre #floods #HeavyRains #LatestNews… pic.twitter.com/di5QfxLdEB— BIG TV Cinema (@BigtvCinema) August 16, 2025
also read: Bollywood: దేశ సేవలో తండ్రులు.. ప్రేక్షకులను మెప్పించడంలో కూతుళ్లు.. ఎవరంటే?